తెలంగాణ

telangana

పండగకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

By

Published : Jan 17, 2021, 8:05 PM IST

పండగకోసం ఇంటికెళ్లాడు. బంధువుల్ని స్నేహితులని కలిసి సంతోషంగా పండగ జరుపుకున్నాడు. వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి స్నేహితురాలిని తీసుకుని ఉద్యోగరీత్యా పట్నం బయలుదేరాడు. కానీ తాను అన్న మాటలను వమ్ము చేస్తూ.. ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

road accident at Nellore district on addanki narketpally
http://10.10.50.85:6060/reg-lowres/17-January-2021/tg-nlg-190-17-accident-okaru-mruthi-av-ts10146_17012021172120_1701f_1610884280_128.mp4

పండగ జరుపుకుని ఆనందగా పట్నం బయలుదేరిన అతడికి అదే అతడికి చివరి పండగ అయింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం, శెట్టి పాలెం గ్రామం వద్ద అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై ప్రమాదవశాత్తు లారీ బైక్​ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

పండగ జరుపుకుని తిరిగి వస్తూ..

నెల్లూరు జిల్లా బుచ్చి రెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఐతే చరణ్ హైదరాబాద్​లో ఓ మల్టీ మీడియా సంస్థలో పని చేస్తున్నాడు. సంక్రాంతి పండగ కోసం సొంత గ్రామానికి వెళ్లాడు. పండగ ముగించుకుని తన స్నేహితురాలైన తెనాలి పట్టణానికి చెందిన కృష్ణ కీర్తితో కలిసి హైదరాబాద్ తిరుగుప్రయాణమయ్యాడు.

లారీ కిందకు చొచ్చుకెళ్లిన బైక్​..

మార్గమధ్యలో నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టి పాలెం వద్ద అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై ప్రమాదవశాత్తు లారీ ఢీకొని చరణ్​ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్​ వేగానికి లారీ కిందకు చొచ్చుకుపోయింది. స్నేహితురాలు కీర్తికి తీవ్ర గాయాలయ్యయి. చికిత్స నిమిత్తం ఆమెను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వేములపల్లి పోలీసులు బంధువులకు సమాచారం ఇచ్చి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఆర్మీలో చేరే అర్హత లేదని యువకుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details