తెలంగాణ

telangana

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ... ఒకరు మృతి

By

Published : Sep 12, 2020, 9:06 PM IST

ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మానకొండూరు మండలం జమ్మికుంట-దేవంపల్లి మార్గంలో జరిగింది.

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ... ఒకరు మృతి
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ... ఒకరు మృతి

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని జమ్మికుంట- దేవంపల్లి మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. జమ్మికుంట నుంచి కరీంనగర్ వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని... ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడం వల్ల పచ్చునూర్​కు చెందిన గాజుల సంపత్ ఘటనాస్థలిలోనే మృత్యువాత పడ్డాడు.

సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు ఘటనా స్థలికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను ఆశ్రయించారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టానకి తరలించారు.

ఇదీ చూడండి:రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి

ABOUT THE AUTHOR

...view details