తెలంగాణ

telangana

గేదెల మందను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

By

Published : Nov 23, 2020, 9:57 AM IST

వ్యవసాయ పనులు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో గేదెల మందను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

one died when tractor rolled over in karimnagar district
గేదెల మందను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి గ్రామానికి చెందిన మామిడిపల్లి శ్రీధర్ అనే వ్యక్తి మృతి చెందాడు.

తన పొలంలో వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని శ్రీధర్ ఇంటికి బయలు దేరాడు. దారిలో గేదెల మందను తప్పించే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్యా, ఇద్దరు పిల్లలున్నారు.

ABOUT THE AUTHOR

...view details