తెలంగాణ

telangana

వీరాంజనేయ సన్నిధిలో చోరీ.. హుండీ ఖాళీ

By

Published : Jan 13, 2021, 4:50 PM IST

వీరాంజనేయ ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు హుండీ పగల గొట్టి డబ్బులన్నీ ఊడ్చుకెళ్లారు. శ్రీరామనవమి నుంచి ఇప్పటి వరకు హుండీ తెరవలేదని ఆలయ కమిటీ పేర్కొంది.

jogulamba gadwal  Theft in the temple latest news
ఆలయంలో చోరీ.. హుండీ ఖాళీ

జోగులాంబ గద్వాల్‌ మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామంలోని ఆలయంలో చోరీ జరిగింది. గ్రామంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు హుండీ పగల గొట్టి డబ్బులు దోచుకెళ్లారు.

గ్రామస్థులు గుర్తించి పోలీస్​లకు ఫిర్యాదు చేశారు. మానవపాడు పోలీస్​లు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిచారు. గతేడాది శ్రీరామనవమి నుంచి ఇప్పటి వరకు హుండీ తెరవలేదని ఆలయ కమిటీ పేర్కొంది.

ఇదీ చూడండి:'కేజీఎఫ్ 2' టీజర్​పై అభ్యంతరం.. యష్​కు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details