తెలంగాణ

telangana

తాగుడుకు బానిసై...మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త

By

Published : Nov 30, 2020, 6:42 PM IST

మద్యానికి డబ్బులివ్వలేదనే కోపంతో భార్యను భర్త కొట్టి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది. మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. అతను పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

husband-killed-wife-in-chirala-prakasam-district  IN AP
తాగుడుకు బానిసై...మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను కొట్టి చంపాడో భర్త. జిల్లాలోని చీరాల బోస్​నగర్​కు చెందిన మందలపు మల్లేశ్వరరావు, శివలక్ష్మికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

కొంతకాలంగా మల్లేశ్వరరావు మద్యానికి బానిసయ్యాడు. తాగేందుకు డబ్బులు కావాలని భార్యను అడిగాడు. ఆమె లేవని చెప్పటంతో కోపంతో తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. భయాందోళనకు గురైన మల్లేశ్వరరావు పరారయ్యాడు. శివలక్ష్మి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడు.. అలా దొరికిపోయాడు

ABOUT THE AUTHOR

...view details