తెలంగాణ

telangana

నేరెడ్‌మెట్‌ బండ చెరువులో బాలిక మృతదేహం లభ్యం

By

Published : Sep 18, 2020, 12:53 PM IST

Updated : Sep 18, 2020, 1:42 PM IST

girl-body-found-nala-in-neredmet
నేరెడ్‌మెట్‌ బాలిక అదృశ్యం ఘటన విషాదాంతం

12:51 September 18

నేరెడ్‌మెట్‌ బాలిక అదృశ్యం ఘటన విషాదాంతం

నేరెడ్‌మెట్‌ బాలిక అదృశ్యం ఘటన విషాదాంతం

మేడ్చల్‌ జిల్లా నేరెడ్‌మెట్‌లో 12 ఏళ్ల బాలిక అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. నిన్న సాయంత్రం అదృశ్యమైన బాలిక... నాలాలో విగతజీవిగా బయటపడింది. కాకతీయనగర్​కు చెందిన ఐదో తరగతి చదువుతున్న 12 ఏళ్ల సుమేధ కపురియా.. నిన్న సాయంత్రం అదృశ్యమైంది. సైకిల్‌పై బయటికి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. 

సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించగా  సైకిల్​పై వెళ్తున్నట్లు గుర్తించారు. జీహెచ్​ఎంసీ బృందాల గాలింపు చర్యల్లో... నాలాలో సైకిల్  దొరికింది. భారీ వర్షానికి దీన్ దయాల్ నగర్  నాలా పొంగిపొర్లడంతో బాలిక ప్రమాదవశాత్తు  పడిపోవచ్చని అనుమానంతో నాలాలో సెర్చ్‌ ఆపరేషన్స్‌ చేపట్టారు. రెస్క్యూ బృందాల గాలింపులో బండ చెరువు వద్ద నాలాలో బాలిక మృతదేహం బయటపడింది.

Last Updated : Sep 18, 2020, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details