తెలంగాణ

telangana

panjshir news: పంజ్​షేర్ ​నుంచి మసూద్​ పరారీ.! తాలిబన్​ చేతిలోకి అందాల లోయ

By

Published : Sep 6, 2021, 11:25 PM IST

పంజ్​షేర్(panjshir news) తమ వశమైనట్టు తాలిబన్లు ప్రకటించారు. తిరుగుబాటు నేత అహ్మద్​ మసూద్​ పరారైనట్లు (afghanistan panjshir news) వెల్లడించారు. మరోవైపు తాను సురక్షితంగానే ఉన్నానని ట్వీట్ చేసిన మసూద్.. ఎక్కడ ఉన్నానన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. ​

taliban
తాలిబన్ల గుప్పిట్లోకి పంజ్​షేర్​.. ఎన్​ఆర్​ఎఫ్​ అధినేత పరారీ!

పంజ్‌షేర్ (panjshir news) ప్రావిన్సులో.. ఎన్​ఆర్​ఎఫ్​ సేనలకు నాయకత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్, మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ అఫ్గానిస్తాన్ వదిలి పారిపోయినట్లు తాలిబన్లు (afghanistan panjshir) ప్రకటించారు. పంజ్‌షేర్‌ ప్రావిన్సును హస్తగతం చేసుకున్నట్లు ప్రకటించిన తాలిబన్లు.

తిరుగుబాటు సేనలకు సారథ్యం వహిస్తున్న.. అహ్మద్ మసూద్, మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ పొరుగున ఉన్న తజకిస్తాన్‌కు పారిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు తాలిబన్ల అధికార ప్రతినిది జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు. మరోవైపు తాను సురక్షితంగానే ఉన్నానని ట్వీట్ చేసిన మసూద్.. ఎక్కడ ఉన్నానన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు.

అఫ్గాన్‌లో తాలిబన్ల నడతలో, నిర్ణయాల్లో రెండు దశాబ్దాల నాటి అనాగరిక ఆలోచనలే ప్రతిబింబిస్తున్నాయి. అరాచకపాలనకు, మూఢనమ్మకాలకు ప్రతీకైన తాలిబన్లు గత ప్రభుత్వంలోని అభివృద్ధి చిహ్నాల రూపురేఖల్ని మార్చేస్తున్నారు. కాబూల్ విమానాశ్రయం వద్ద ఉన్న 'ఐ లవ్‌ కాబూల్‌' అనే అక్షరాల నుంచి లవ్ గుర్తును తొలగించారు.

విమానాశ్రయంలోని బిల్‌బోర్డుపై హమీద్ కర్జాయ్ పేరును తీసేసిన తాలిబన్లు.. తమదైన రీతిలో స్వేచ్ఛ అనేది ప్రతి సమాజం హక్కు అని.. స్వేచ్ఛను కాపాడటం కోసం మనమంతా త్యాగం చేయాలనే నినాదాల్నిచేర్చారు. అక్కడే ఉన్న అష్రఫ్ ఘనీ పేరును సైతం తొలగించిన తాలిబన్లు..ఇస్లామిక్ విధానాలను అనుసరించే అఫ్గాన్ ప్రపంచంతో సత్ససంబంధాలు కొనసాగిస్తుందనే వ్యాఖ్యలను జత చేశారు. ఇలా అడుగడుగునా తమకు నచ్చిన రీతిలోనే వ్యవహరిస్తూ తాలిబన్లు...ఈ బోర్డులపై తమ దేశం అఫ్గానిస్థాన్ పేరును సైతం సరిగా రాయలేకపోవటం విశేషం

ఇదీ చూడండి :అమెరికాకు షాక్- ఆ విమానాలను అడ్డుకున్న తాలిబన్లు

ABOUT THE AUTHOR

...view details