తెలంగాణ

telangana

సముద్రంలో మూడు పడవలు మాయం.. 300 మంది వలసదారులు మిస్సింగ్​!

By

Published : Jul 10, 2023, 9:46 PM IST

Three Boats Capsized : ఆఫ్రికాలోని సెనెగల్‌ నుంచి స్పెయిన్‌కు వెళ్తున్న మూడు బోట్లు కనిపించకుండా పోయాయి. ఆ మూడు పడవల్లో 300 మందికిపైగా వలసదారులు ఉన్నట్లు తెలుస్తోంది.

senegal boat capsize
senegal boat capsize

Three Boats Capsized : ఆఫ్రికాలోని సెనెగల్‌ నుంచి స్పెయిన్‌కు చెందిన కానరీ దీవులకు బయల్దేరిన మూడు బోట్లు.. అట్లాంటిక్​ మహా సముద్రంలోకనిపించకుండా పోయాయి. వాటిలో 300 మందికిపైగా వలసదారులు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే స్పెయిన్‌ అధికారులు.. కానరీ దీవుల సమీపంలో అన్వేషణ మొదలుపెట్టారు.

'200 మందికిపైగా వలసదారులతో ఒక పడవ, 100 మందికిపైగా పౌరులతో మరో రెండు బోట్లు దాదాపు రెండు వారాల క్రితం కానరీ దీవులకు బయల్దేరాయి. మార్గమధ్యలో అవి తప్పిపోయాయి. వలసదారుల్లో చాలామంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. స్పెయిన్‌, సెనెగల్ అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి' అని వలసదారుల హక్కుల సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానరీ దీవులకు కొన్నేళ్లుగా వలసదారుల తాకిడి తీవ్రంగా పెరిగింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే ఏడు వేలమందికిపైగా ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా మారటేనియా, మొరాకో, పశ్చిమ సహారా, సెనెగల్‌ల నుంచి ఇక్కడికి వస్తున్నారు.

Boats Capsizing Senegal : అయితే, పశ్చిమ ఆఫ్రికా నుంచి కానరీ దీవుల ప్రయాణ మార్గం అత్యంత ప్రమాదకరమైనదని నివేదికలు చెబుతున్నాయి. అట్లాంటిక్‌ భీకర అలల ధాటికి చిన్నచిన్న పడవల వంటివి నిలవడం కష్టం. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఈ మార్గంలో దాదాపు 800 మంది చనిపోవడమో లేదా తప్పిపోవడమో జరిగింది. గతంలో వాయువ్య ఆఫ్రికా నుంచి కానరీ దీవులకు చేరుకునే ప్రయత్నంలో దాదాపు ఏడు శరణార్థుల పడవలు.. కరేబియన్ దీవులు, బ్రెజిల్‌కు కొట్టుకుపోయాయి. అయితే.. స్థానికంగా ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, హింస, రాజకీయ అస్థిరత, వాతావరణ మార్పుల వంటి అనేక అంశాలు వలసదారులను తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశం దాటేందుకు కారణమవుతున్నాయి.

Boat Accident Greece : కొన్నాళ్ల క్రితం గ్రీస్‌లో వలసదారులతో వెళ్తున్న ఓ పడవ సముద్రంలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 78 మంది మరణించగా.. అనేక మంది గల్లంతయ్యారు. తూర్పు లిబియా నుంచి వలసదారులతో ఇటలీ వెళుతున్న పడవ.. ప్రమాదవశాత్తు బోల్తా పడినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ గ్రీస్ సముద్ర తీరానికి 75 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 104 మందిని రక్షించినట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ABOUT THE AUTHOR

...view details