తెలంగాణ

telangana

షాపింగ్​ మాల్​లో భారీ అగ్నిప్రమాదం- 11 మంది మృతి

By PTI

Published : Nov 25, 2023, 4:05 PM IST

Updated : Nov 25, 2023, 5:06 PM IST

Shopping Mall Fire Accident in Karachi : పాకిస్థాన్ కరాచీలోని ఓ షాపింగ్ మాల్​లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 42 మందిని రక్షించారు.

Shopping mall Fire accident in karachi
Shopping mall Fire accident in karachi

Shopping Mall Fire Accident in Karachi : ఓ షాపింగ్ మాల్​లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. ఆరుగురు గాయపడ్డారు. పాకిస్థాన్​లోని కరాచీ నగరంలో శనివారం జరిగిందీ ఘటన. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన సిబ్బంది 42 మందిని రక్షించారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నట్టు సమాచారం.

శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో షాపింగ్ మాల్ రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాసేపటికే మాల్​లోని నాలుగు, ఐదు అంతస్తులకు వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు పన్నెండు అగ్నిమాపక యంత్రాలతో 50 మంది సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతి కష్టం మీద మంటలు ఆర్పారు. లోపల చిక్కుకున్న 42 మందిని రక్షించారు. గాయపడిన వారిని చిక్సిత కోసం ఆసుపత్రికి తరలించారు.

"మంటలను అదుపు చేసేందుకు మాల్​కు విద్యుత్​ సరఫరా నిలిపివేశాం. ఊపిరాడక మంటల్లో చిక్కుకుని 11మంది మృతిచెందారు. భవనంలో ఉన్న వారి కోసం ఇంకా మా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఇంకా కారణాలు తెలియలేదు. దర్యాప్తు చేస్తున్నాం. గత వారమే కొంత మంది అధికారులు కరాచీలోని పలు భవనాలను పరిశీలించారు. వీటిలో 90 శాతం మేర భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని చెప్పారు."

-చీఫ్ ఫైర్ ఆఫీసర్ ముబిన్ అహ్మద్

"మృతదేహాలను రెండు ఆసుపత్రులకు తరలించాం. తొమ్మిది మృతదేహాలను జిన్నా ఆసుపత్రికి.. మరో రెండింటిని సివిల్ ఆసుపత్రికి తరలించాం. సిబ్బంది రక్షించిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది." అని కరాచీ మేయర్ ముర్తజా వహాబ్ తెలిపారు.

పునరావాస కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం, 32 మంది మృతి
Fire Accident In Iran Today: కొద్ది రోజుల క్రితం.. ఉత్తర ఇరాన్​లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఇరాన్​ రాజధాని టెహ్రాన్​కు వాయవ్యంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్​రోడ్​ నగరంలోని ఓ ప్రైవేటు మాదకద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 32 మంది మృతి చెందగా.. మరో 17 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించామని అధికారులు తెలిపారు.

బొగ్గు గని కంపెనీ ఆఫీస్​లో భారీ అగ్నిప్రమాదం- 26మంది మృతి

దీపావళి వేడుకల్లో అగ్నిప్రమాదం- లండన్​లో ఒకే కుటుంబంలోని ఐదుగురు భారతీయులు మృతి

Last Updated : Nov 25, 2023, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details