తెలంగాణ

telangana

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం.. మరో 22 మంది..

By

Published : Jan 8, 2023, 8:04 AM IST

Updated : Jan 8, 2023, 11:38 AM IST

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందగా.. 22 మంది గాయపడ్డారు. దట్టమైన పొగమంచు వల్లే ప్రమాదం జరిగిందని సమాచారం.

several killed in china accident
several killed in china accident

తూర్పు చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జియాంగ్​షీ రాష్ట్రంలో నాన్‌చాంగ్​లో ఆదివారం జరిగిన ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దట్టమైన పొగమంచు వల్ల హైవేపై వెళ్తున్న వాహనాలు.. ఒకదానిని మరొకటి ఢీకొన్నట్లు సమాచారం. కాగా, నాన్‌చాంగ్ సిటీ బయట జరిగిన ఈ ఘటనలో ఎన్ని వాహనాలు ఢీకొన్నాయనే వివరాలపై స్పష్టత లేదు.

ఈ నెలాఖరులో లూనార్​ కొత్త సంవత్సర వేడుకలు ఉన్నాయి. దీంతో సెలవు రోజుల్లో వివిధ నగరాల్లో పనిచేసే వాళ్లు.. తమ సొంత ఊళ్లకు వెళతారని అధికారులు చెప్పారు. దాని కారణంగానే ట్రాఫిక్​ ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఇలాంటి సమయాల్లో అన్ని వాహనాలు ఫుల్​ లోడ్​తో వెళ్తాయన్నారు. ఫిట్​నెస్​ నేని వాహనాలు, కెపాసిటీకి మించి ఓవర్​లోడ్​తో వెళ్లడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయని తెలిపారు. దీనికి తోడు కొవిడ్​ ఆంక్షలు ఎత్తేయడం వల్ల కొత్తఏడాది పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య రెట్టింపు అయ్యిందని వెల్లడించారు.

Last Updated : Jan 8, 2023, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details