తెలంగాణ

telangana

Red Wine River Viral Video : రోడ్లపై ఏరులై పారిన 20లక్షల లీటర్ల వైన్‌.. షాక్​లో ప్రజలు.. ఏం జరిగింది?

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 3:20 PM IST

Updated : Sep 12, 2023, 3:54 PM IST

Red Wine River Viral Video : భారీ వర్షాలు వచ్చినప్పుడు వరద పోటెత్తి వీధుల్లో ప్రవహిస్తే ఎలా ఉంటుందో.. అచ్చం అలా రెడ్‌ వైన్‌ వీధుల్లో నదిలా ప్రవహించింది. సమీపంలోని ఇళ్లను వైన్‌ వరద ముంచెత్తింది. మిలియ‌న్ల లీట‌ర్ల రెడ్ వైన్‌ వీధుల వెంట ఉరుకులు ప‌రుగులు తీసింది. ఈ హఠాత్పరిణమానికి అసలు ఏం జరుగుతోందో అర్థం కాక ప్రజలంతా షాక్‌కు గురయ్యారు.

Red Wine River Viral Video
Red Wine River Viral Video

Red Wine River Viral Video : వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై పారే వరద నీటి తరహాలో రోడ్లపై వైన్ పారింది. లక్షల లీటర్ల వైన్ వీధుల వెంబడి ప్రవహించింది. ఎగుమతికి సిద్ధం చేసిన బ్యారల్స్ పేలిపోవడం వల్ల రోడ్లపై వైన్ వరద పారింది. దీంతో అధికారులు ఆ మందు వరదను వేరే ప్రాంతాలకు మళ్లించారు. మందుబాబులను ఆశ్చర్యానికి గురిచేసే ఘటన ఆదివారం.. పోర్చుగల్ దేశంలో జరిగింది.

Red Wine River In Portugal : పోర్చుగల్‌లోని సావో లోరెంకో డి బైరో అనే పట్టణం ఉంది. ఆదివారం ఆ పట్టణ వీధుల్లో రెడ్ వైన్ వరదలా ప్రవహించింది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పట్టణంలోని లెవిరా డిస్టిలరీ 2 మిలియన్ లీటర్ల వైన్‌ను నుంచి ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసింది. పెద్ద బ్యారెల్స్​లో నిల్వ చేశారు. వాటిని రవాణా చేస్తుండగా బారెల్స్‌ అనుకోకుండా పేలిపోయాయి. దీంతో వైన్ కొండ ప్రాంతాల్లో వరదలా ఎగువ ప్రాంతం నుంచి కిందకు ప్రవహించింది. పట్టణంలోని నిటారుగా ఉన్న కొండపై నుంచి లక్షలాది లీటర్ల వైన్ వీధుల్లో ప్రవహించడం వల్ల స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇళ్లు, కాలువ, రోడ్లలో ప్రవహిస్తున్న వైన్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ ఊరిలో వైన్‌తో నిండిన నది ప్రవహించినట్లు పోస్ట్ చేశారు.

ఎంత వైన్ నేల పాలైందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒలింపిక్ క్రీడల్లో స్విమ్మింగ్ పూల్‌ను నింపగలిగేంత వైన్ రోడ్డుపై ప్రవహించింది. ఎగువ ప్రాంతాల నుంచి వైన్ వరదలా ఇళ్లలోకి ప్రవహించింది. వైన్ పట్టణంలోని మిగిలిన ప్రాంతాల్లో ప్రవహించే ముందు డిస్టిలరీకి సమీపంలో ఉన్న ఒక ఇంటిలోకి వైన్ వరద ముంచెత్తినట్లు వార్తలు వచ్చాయి. పక్కనే సెర్టిమా నదిని వైన్ నదిగా మారకుండా, వైన్ వరదను ఆపడానికి అగ్నిమాపక విభాగం చర్యలు చేపట్టింది. బారెల్స్‌ పగిలి రెడ్‌ వైన్‌ పట్టణ వీధుల్లో ప్రవహించిందని.. దీనికి పూర్తి బాధ్యత తమదే అని.. వీధులను తామే శుభ్రపరుస్తామని.. ఈ తప్పిదానికి పట్టణ వాసులను క్షమాపణలు కోరుతున్నామని లెవిరా డిస్టిలరీ ఓ ప్రకటన విడుదల చేసింది.

Last Updated : Sep 12, 2023, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details