తెలంగాణ

telangana

Canada PM Trudeau Statement : కెనడా కయ్యం.. రెచ్చగొట్టం అంటూనే కశ్మీర్​పై ట్రావెల్​ అడ్వైజరీ.. అమెరికా ఆందోళన

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 10:44 PM IST

Updated : Sep 19, 2023, 10:55 PM IST

Canada PM Trudeau Statement On India : భారత్​పై కెనడా ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్య యుద్ధానికి తెరలేపాయి. ఈ క్రమంలో ట్రూడో మరోసారి భారత్​ గురించి వ్యాఖ్యానించారు. తాము భారత్​ను రెచ్చగొట్టాలని అనుకోవడం లేదని.. ఈ విషయాన్ని భారత్​ సీరియస్​గా తీసుకోవాలని కోరారు.

Canada PM Trudeau Statement On India
Canada PM Trudeau Statement On India

Canada PM Trudeau Statement On India :ఖలిస్థానీ మద్దతుదారుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య.. వెనుక భారత్‌ హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో సోమవారం చేసిన సంచలన ఆరోపణలు దుమారం రేపాయి. తాజాగా ట్రూడో ఈ వ్యవహారంపై మరోసారి స్పందించారు. భారత్‌ను తాము రెచ్చగొట్టాలని అనుకోవడం లేదని, ఉద్రిక్తతలు పెంచాలని చూడటం లేదని అన్నారు. సిక్కు నేత, కెనడా పౌరుడి హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని భారత్‌ను కోరుతున్నామని తెలిపారు. ప్రతి విషయం స్పష్టంగానే ఉందని.. సరైన ప్రక్రియలో జరుగుతోందని నిర్ధరించుకునేందుకు భారత్‌తో కలిసి పనిచేయాలని అకుంటున్నట్లు ట్రూడో చెప్పారు.

ఇదిలా ఉండగా.. కెనడా మరో అడుగు ముందుకేసి తమ పౌరులకు ట్రావెల్​ అడ్వైజరీ జారీ చేసింది. జమ్ము కశ్మీర్​కు వెళ్లొద్దని కెనడా పౌరులకు సూచించింది. 'అనూహ్యమైన భద్రతా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి వెళ్లకండి. ఉగ్రవాదం, మిలిటెన్సీ, పౌర అశాంతి, కిడ్నాప్‌ల ముప్పు ఉంది" అని కెనడా తన ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొంది.

India Vs Canada On Khalistan :అంతకుముందు హర్​దీప్​ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారిని కెనడా బహిష్కరించింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన భారత్​కెనడా దౌత్యవేత్తను కూడా బహిష్కరించి, గట్టి బదులిచ్చింది. ట్రూడో చేసిన ఆరోపణలను 'అసంబద్ధ', 'ప్రేరేప్రితమనవి'గా తోసిపుచ్చింది. "మాది చట్టబద్ధమైన పాలనకు.. బలమైన నిబద్ధత కలిగిన ప్రజాస్వామ్య రాజకీయం. కెనడాలో ఆశ్రయం పొందిన ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చడానికి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ముప్పును కొనసాగిస్తున్నాయి. ఈ విషయంపై కెనడియన్ ప్రభుత్వంతో.. దీర్ఘకాలంగా, నిరంతరం మా ఆందోళన తెలియజేస్తున్నాం" అని భారత విదేశాంగ ఘాటుగా స్పందించింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ పరిణామాల మధ్య ట్రూడో మరోసారి మాట్లాడటం చర్చనీయాంశమైంది.

ఇది చాలా సీరియస్​ మ్యాటర్​.. : ఎస్​జీపీసీ
హర్​దీప్​ సిగ్​ నిజ్జర్​ హత్య వ్యవహారంతో భారత్​-కెనడా మధ్య తౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో శిరోమని గురుద్వారా పర్​బంధక్​ కమిటీ- ఎస్​జీపీసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయం చాలా తీవ్రమైనదని.. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులపై ప్రభావం చూపుతుందని తెలిపింది. భారత్​లోని సిక్కుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరింది. విదేశాలలో నివసిస్తున్న సిక్కుల సమస్యలు, మనోభావాలను అర్థం చేసుకుని అర్థవంతమైన పరిష్కారం దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై రెండు దేశాల ప్రభుత్వాలు ఆరోపణలకు బదులు.. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి వారి అజెండాలోకి తీసుకురావాలని ఎస్​జీపీసీ చీఫ్​ హర్​జిందర్ సింగ్ ధామీ పేర్కొన్నారు.

Khalistan Tiger Force Chief Nijjar :ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చనడానికి విశ్వసనీయమైన సమాచారం ఉందని ట్రూడో ఆరోపించారు. ఈ క్రమంలోనే కెనడాలోని భారత దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడాలోని ఇండియనే ఎంబసీలోని రీసెర్చి అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ అధిపతిని బహిష్కరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలను భారత విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది.

India Vs Canada Conflict :ట్రూడో చేసిన ఆరోపణలపై అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోందని.. ఆ దేశ జాతీయ భద్రత మండలి ప్రతినిధి ఆడ్రియన్ వాట్సన్ తెలిపారు. కెనడియన్ భాగస్వాములతో కాంటాక్ట్​లో ఉంటామన్నారు. కెనడా దర్యాప్తు కొనసాగడం, నిందితులను శిక్ష పడేలా చేయడం చాలా సంక్షిష్టమైనదని చెప్పారు.

దీనిపై ఆస్ట్రేలియా కూడా ఆందోళన చెందుతున్నట్లు.. ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్​ తెలిపారు. ఈ విషయంపై కెనడా భాగస్వాములతో రెగులర్ కాంటాక్ట్​లో ఉన్నామని వెల్లడించారు. ఇక తమ ఆందోళలనలను సీనియర్​ అధికారుల స్థాయిలో భారత్​కు తెలియజేశామన్నారు.

Canada Expels Indian Diplomat : భారత దౌత్యవేత్తను బహిష్కరించిన కెనడా.. దీటుగా బదులిచ్చిన మోదీ సర్కార్

Canada India Relationship : భారత్​-కెనడా విభేదాలకు కారణం ప్రధానే! రాజకీయ బలహీనత వల్లే ఇలా..

Last Updated : Sep 19, 2023, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details