తెలంగాణ

telangana

Canada Embassy India : భారత అల్టిమేటం సక్సెస్.. డెడ్​లైన్​కు ముందే సింగపూర్​కు కెనడా దౌత్యవేత్తలు!

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 7:41 AM IST

Updated : Oct 7, 2023, 7:46 AM IST

Canada Embassy India : భారత్‌లో అధికంగా గల తమ దౌత్యవేత్తలను కెనడా వెనక్కు తీసుకుంది. దిల్లీ మినహా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కెనడా దౌత్యవేత్తలను.. మలేసియా లేదా సింగపూర్‌కు తరలించినట్లు తెలిసింది.

Canada Embassy India
Canada Embassy India

Canada Embassy India : ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య తర్వాత.. భారత్‌- కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా పడిపోయాయి. భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో నిరాధార ఆరోపణల తర్వాత.. ఆ దేశ దౌత్య సిబ్బందిని దేశం విడిచి వెళ్లాలని మోదీ ప్రభుత్వం ఆదేశించింది. భారత ప్రభుత్వ ఆదేశాలతో కొంతమంది తమ దౌత్యవేత్తలను కెనడా ఇతర దేశాలకు తరలించినట్లు తెలుస్తోంది. దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో దిల్లీ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ట్రూడో సర్కారు ఈ చర్యలు చేపట్టింది. భారత్‌లో దిల్లీ మినహా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కెనడా దౌత్యవేత్తలను మలేసియా, లేదా సింగపూర్‌కు తరలించినట్లు ఓ అంతర్జాతీయ వార్త కథనం వెల్లడించింది. అయితే ఎంతమంది దౌత్య సిబ్బందిని భారత్‌ నుంచి తరలించారనేదానిపై మాత్రం స్పష్టత లేదు. దీనిపై అటు కెనడా నుంచి గానీ.. ఇటు భారత ప్రభుత్వం నుంచి గానీ అధికారిక ప్రకటన రాలేదు.

Canada Embassy In India : దౌత్యసిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాల్సిన అవసరముందని భారత్‌ గతంలోనూ కెనడాకు సూచించింది. ఇటీవల నిజ్జర్‌ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్‌ విదేశాంగ శాఖ.. దిల్లీలో కెనడా దౌత్యవేత్తల అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఒట్టావాలోని భారత దౌత్యసిబ్బంది సంఖ్యతో పోలిస్తే దిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, దాన్ని సమస్థాయికి తీసుకురావాలని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే దౌత్య సిబ్బందిని తగ్గించుకునేందుకు కెనడాకు అక్టోబరు 10వ తేదీ వరకు దిల్లీ డెడ్‌లైన్‌ విధించింది. అక్టోబరు 10లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని, ఆ తేదీ దాటిన తర్వాత కూడా అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్‌ హెచ్చరించినట్లు ఆ కథనం పేర్కొంది.

India Canada Embassy : భారత్‌లో దౌత్య సిబ్బందిని కెనడా తగ్గించుకోవాల్సిందేనని విదేశాంగ శాఖ ప్రతినిధి అరీందమ్‌ బాగ్చి కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే డెడ్‌లైన్‌ గురించి అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానమివ్వలేదు. ప్రస్తుతం భారత్‌లో 60 మందికి పైగా కెనడా దౌత్య సిబ్బంది ఉండగా.. అందులో 41 మందిని వెనక్కి పిలిపించుకోవాలని కెనడాకు భారత్‌ సూచించింది.

Jaishankar Statement On Canada : 'ఉగ్రవాదంపై ఉదాసీన వైఖరా? నిజ్జర్ హత్యపై కచ్చితమైన ఆధారాలేవి?'.. కెనడాను కడిగేసిన జైశంకర్

Canada Reaction On Indias Ultimatum : 'భారత్​తో తెరవెనుక మంతనాలకు కెనడా సిద్ధం!'

Last Updated : Oct 7, 2023, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details