తెలంగాణ

telangana

వైరస్ బాధితులను వెంటాడుతున్న 'లాంగ్​ కొవిడ్​'!

By

Published : Apr 20, 2022, 4:08 AM IST

Long Covid: కరోనా సోకిన వారిలో 30 శాతం మంది లాంగ్​ కొవిడ్​తో బాధపడుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. మొత్తం 1038 మందిపై పరిశోధన చేపట్టగా వీరిలో 309 మందిలో లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. కొందరిలో కొన్ని లక్షణాలు దీర్ఘకాలంపాటు వేధిస్తున్నట్లు గుర్తించారు.

long covid
లాంగ్​ కొవిడ్​

Long Covid Symptoms: కరోనా వైరస్‌ సోకిన బాధితుల్లో 30శాతం మందిలో దీర్ఘకాలిక కొవిడ్‌ వెంటాడుతున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. ఇన్‌ఫెక్షన్‌ బారినపడిన నుంచి నెలల తరబడి వారిని కొన్ని లక్షణాలు వేధిస్తున్నాయని తెలిపింది. కొవిడ్‌ సోకిన అనంతర ప్రభావాలపై అమెరికా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

కరోనా వైరస్‌ సోకి ఆస్పత్రి పాలైన వారితోపాటు మధుమేహం, అధిక బరువు ఉన్న వారిలో పోస్ట్‌ అక్యూట్‌ సీక్వెలే ఆఫ్‌ కొవిడ్‌గా (PASC) పిలిచే 'లాంగ్‌ కొవిడ్‌' ఎక్కువగా కనిపిస్తున్నట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెల్స్‌ (UCLA) పరిశోధకులు వెల్లడించారు. దీర్ఘకాల కొవిడ్‌పై 309 మంది బాధితులపై అధ్యయనం చేపట్టగా.. కొవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న వారిలో అధికశాతం అలసట (31శాతం), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (15 శాతం) వంటి లక్షణాలతో బాధపడినట్లు గుర్తించారు. ఇక వాసన గుర్తించకపోయే లక్షణం 16 శాతం మందిలో కనిపించిందన్నారు.

కొవిడ్‌ తదనంతర ప్రభావాలను తెలుసుకోవడంలో భాగంగా అమెరికా పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో మొత్తం 1038 మంది కొవిడ్‌ బాధితులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 309 మందిలో లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. కొందరిలో కొన్ని లక్షణాలు దీర్ఘకాలంపాటు వేధిస్తున్నట్లు గుర్తించారు. అయితే, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిపై దీర్ఘకాలంలో కొవిడ్‌ ఎటువంటి ప్రభావం చూపిస్తుందన్న విషయాలను తెలుసుకోవడంలో తాజా అధ్యయనం దోహదపడుతుందని పరిశోధనలో కీలక పాత్ర పోషించిన యూసీఎల్‌ఏ ప్రొఫెసర్‌ సస్‌ యూ పేర్కొన్నారు.

ఇదీ చూడండి :'ఆకలి తీరదు.. నిద్ర పట్టదు.. స్నానమూ కష్టమే!'.. చైనా క్వారంటైన్ కేంద్రాల్లో నరకం!!

ABOUT THE AUTHOR

...view details