తెలంగాణ

telangana

పేద దేశాల్లో టీకా పంపిణీపై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన

By

Published : Apr 29, 2021, 4:26 PM IST

ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేసిన కొవిడ్​ టీకా డోసుల్లో 82 శాతం.. సంపన్న దేశాలకే చేరాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పేద దేశాల్లో 0.3 శాతం టీకా డోసులు మాత్రమే పంపిణీ జరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది.

tedros
'ఆ దేశాల్లో 0.3 శాతం టీకా డోసులే పంపిణీ'

ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ జరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) డైరెక్టర్​ టెడ్రోస్​ అథనోమ్ తెలిపారు. కానీ, వాటిలో 82 శాతం టీకా డోసులు.. అధిక, మధ్యాదాయ దేశాలకే చేరాయని చెప్పారు. అల్పాదాయ దేశాల్లో ఇప్పటివరకు 0.3 శాతం టీకా డోసులు మాత్రమే అందించారని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్చుగల్​లో జరిగిన ఓ ఆన్​లైన్​.. సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు.

"అల్పాదాయ దేశాల్లో 0.3 శాతం టీకాలు మాత్రమే పంపిణీ జరిగింది. ఇదే అసలైన వాస్తవం. మహమ్మారి విసిరే సవాళ్లను ఎదుర్కోవటంలో.. వ్యాక్సిన్లను అందరికీ సమానంగా అందించడం చాలా ముఖ్యం. సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థిరత్వాలకు పునాది ప్రజల ఆరోగ్యమే."

-టెడ్రోస్ అథనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​

ఇదీ చూడండి:'80 దేశాలకు టీకా, 150 దేశాలకు ఔషధాలిచ్చాం'

ABOUT THE AUTHOR

...view details