తెలంగాణ

telangana

యునెస్కో వెబ్​సైట్​లో 'హిందీ'.. భారత్​కు అరుదైన గౌరవం

By

Published : Jan 11, 2022, 11:22 AM IST

Updated : Jan 11, 2022, 11:52 AM IST

UNESCO

UNESCO World Heritage Centre: భారత వారసత్వ కట్టడాల వివరాలను వరల్డ్​ హెరిటేజ్​ సెంటర్​ వెబ్​సైట్​లో హిందీలోనూ అందుబాటులో ఉంచేందుకు నిర్ణయం తీసుకుంది యునెస్కో. ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధికి ఈ విషయాన్ని తెలియజేశారు డబ్ల్యూహెచ్​సీ డైరెక్టర్​.

UNESCO World Heritage Centre:ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది యునెస్కో. ప్రపంచ వారసత్వం కేంద్రం(వరల్డ్​ హెరిటేజ్​ సెంటర్)​ వెబ్​సైట్​లో.. భారత్​కు చెందిన వారసత్వ కట్టడాల వివరాలను హిందీలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఈమేరకు యునెస్కో(పారిస్​)లో భారత శాశ్వత ప్రతినిధికి తెలియజేశారు యునెస్కో వరల్డ్​ హెరిటేజ్​ సెంటర్​ (డబ్ల్యూహెచ్​సీ) డైరెక్టర్​.

World Hindi Day: 2022, జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవ వేడుకలను వర్చువల్​గా నిర్వహించారు యునెస్కోలో భారత్​ శాశ్వత ప్రతినిధి విశాల్​ వీ శర్మ. భారత్​కు స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో హిందీ సాధించిన కీలక అంశాలు, దాని ప్రాముఖ్యతను తెలియజేశారు. అలాగే.. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి హాజరై ప్రసంగించారు. హిందీ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

మరోవైపు.. ప్రపంచ హిందీ దినోత్సవ వేడుకలకు విద్యా, సామాజిక, సాంస్కృతిక, సమాచార, ప్రసారాల విభాగలకు చెందిన ప్రతినిధులు వీడియో సందేశాలు పంపారు. అలాగే.. అంగోలా, బంగ్లాదేశ్​, బ్రెజిల్​, ఈక్వెడార్​, ఫ్రాన్స్​ గ్రీస్​, ఇరాన్​, జపాన్​, మంగోలియా, పాలస్తినా, కొరియా, రష్యా, శ్రీలంక, వియాత్నంలకు చెందిన యునెస్కోలో శాశ్వత ప్రతినిధులు వీడియో సందేశాలు పంపించి.. హిందీ ప్రాముఖ్యతపై మాట్లాడారు.

ఇదీ చూడండి:

యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి భారత్ ఎన్నిక

Last Updated :Jan 11, 2022, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details