తెలంగాణ

telangana

ఉక్రెయిన్​ అంశంపై ఐరాసలో ఓటింగ్​.. భారత్​ దూరం

By

Published : Mar 25, 2022, 5:18 AM IST

Ukraine India News: ఉక్రెయిన్​లో మానవతా సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్​ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. ఐరాసలో మొత్తం 193 దేశాలు ఉండగా.. 140 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి.

Ukraine India News
Ukraine India News

Ukraine India News: ఉక్రెయిన్​లో మానవతా సంక్షోభానికి రష్యా కారణమంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్​ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. యుద్ధం విరమణ, మానవతా సంక్షోభాన్ని అడ్డుకోవడం తదితర చర్యలు చేపట్టడంపై దృష్టి సారించాలని ఉక్రెయిన్ తీర్మానంలో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మొత్తం 193 దేశాలు ఉండగా.. 140 దేశాలు తీర్మానానికి అనకూలంగా ఓటు వేశాయి. మరో 38 దేశాలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. మరో ఐదు దేశాలు ఉక్రెయిన్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి.

చర్చల ద్వారానే సమస్య పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు భారత్‌ స్పష్టంచేసింది. అంతర్జాతీయ చట్టాలు, దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరాన్ని మరోసారి నొక్కిచెప్పింది. ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులు విరమణ చేపట్టాలని పునరుద్ఘాటించింది. సామరస్యంగా యుద్ధం ముంగింపు, తక్షణ మానవతా సాయంపై ఐరాస దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సూచించింది. ముసాయిదా తీర్మానం వీటిపై ఆశించిన స్థాయిలో దృష్టి సారించలేదని భారత్‌ పేర్కొంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో పరిస్థితులు.. వేగంగా క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. భాస్వరంతో తయారు చేసిన బాంబులను రష్యా తమపై ప్రయోగిస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. సైనిక పరంగా నాటో సాయం అందించాలని అభ్యర్థించారు. ఈ యుద్ధంలో రష్యా సైన్యానికి కూడా భారీ నష్టమే వాటిల్లినట్లు నాటో అంచనా వేసింది.

ఇదీ చూడండి:యుద్ధానికి నెల రోజులు.. రష్యా లక్ష్యం నెరవేరిందా..?

ABOUT THE AUTHOR

...view details