తెలంగాణ

telangana

కరోనా కొత్త కేసుల్లో సగం ఐరోపా దేశాల్లోనే..

By

Published : Nov 18, 2020, 10:06 PM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ పంజా విసురుతోంది. ఇప్పటివరకూ మొత్తంగా 5.61కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా 13,46,753 మంది మృతిచెందారు. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఐరోపాలో వైరస్​ వ్యాప్తి తీవ్రంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

CORONA_WORLD
కరోనా పంజా: రష్యాలో ఒక్కరోజే 20 వేల కేసులు

కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజు రోజుకీ పెరుగుతోంది. అయితే, వైరస్​ నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా స్థిరంగా పెరుగుతుండటం సానుకూలాంశం. ప్రపంచవ్యాప్తంగాఇప్పటివరకూ 13 లక్షల మందికిపైగా వైరస్​కు బలి కాగా.. కోటి 56 లక్షలకు పైగా యాక్టివ్​ కేసులున్నాయి. అమెరికా, భారత్​తో పాటు బ్రెజిల్​, ఫ్రాన్స్​, రష్యా, స్పెయిన్ దేశాల్లో కొవిడ్​ కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది.

  • ఐరోపాలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్నా... గత వారం రోజుల్లో వైరస్​ వ్యాప్తి స్వల్పంగా అదుపులోకి వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ చర్యల మూలంగానే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదైన కేసుల్లో సగం ఐరోపాలోనివే.
  • రష్యాలో అత్యధికంగా ఒకే రోజు 20,985 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19 లక్షలు దాటింది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 34,387గా ఉంది.
  • ఇరాన్​లో తాజాగా 13,421 కొత్త కేసులు నమోదయ్యాయి. 480 మంది వైరస్​కు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 8,01,894కు పెరిగి, మొత్తం మృతుల సంఖ్య 42,921కి చేరింది.
  • పొలాండ్​లో ఒక్కరోజే 19,883 మందికి వైరస్​ సోకింది. గడిచిన 24 గంటల్లో వైరస్​ కారణంగా 603 మంది మృతిచెందారు.

వివిధ దేశాల్లో కొవిడ్​ కేసులు ఇలా:

దేశం మొత్తం కేసులు మరణాలు
అమెరికా 11,703,322 2,54,370
బ్రెజిల్ 5,911,758 166,743
ఫ్రాన్స్ 2,036,755 46,273
రష్యా 1,991,998 34,387
స్పెయిన్ 1,535,058 41,688
బ్రిటన్ 1,410,732 52,745
అర్జెంటినా 1,329,005 36,106
ఇటలీ 1,238,072 46,464
కొలంబియా 1,211,128 34,381
మెక్సికో 1,011,153 99,026

ABOUT THE AUTHOR

...view details