తెలంగాణ

telangana

ఇటలీ తదుపరి ప్రధానిగా 'మారియో ద్రాగి'!

By

Published : Feb 13, 2021, 2:26 PM IST

ఇటలీ తదుపరి ప్రధానిగా 'మారియో ద్రాగి' బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ద్రాగి గతంలో.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షునిగా సేవలందించారు.

Mario Draghi to be sworn in as Italy Prime Minister
ఇటలీ ప్రధానిగా మారియో

యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు.. 'మారియో ద్రాగి' ఇటలీ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ దేశాధ్యక్షుని సూచన మేరకు ప్రధాని పదవిని చేపట్టేందుకు మారియో అంగీకరించారు. గత నెలలో ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ వర్గాలు మారియోకు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు ఆయన శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఫైవ్​ స్టార్​ ఉద్యమం..

దేశంలో 'ఫైవ్ స్టార్ ఉద్యమం'లో చురుగ్గా పాల్గొన్న మారియోకు పార్లమెంటులో సంపూర్ణ మద్దతు లభించింది. ఇక ఈ ఉద్యమంలో పాల్గొన్న తన సహచరుడు 'లుయిగి డి మైయో' విదేశాంగ మంత్రిగా కొనసాగుతారని మారియో ప్రకటించారు.

తప్పని ముప్పు..

ఇటలీని కరోనా ముప్పు వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే అక్కడ 93,000 మందికిపైగా కొవిడ్​ మరణాలు నమోదయ్యాయి. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో ఆరో స్థానంలో ఉంది. మహమ్మారి దెబ్బకు గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో దేశ బాధ్యతలు మారియోకి అప్పగించడం శ్రేయస్కరమని మాజీ ప్రధాని మాటో రెన్జి సహా అనేకమంది నిపుణులు సైతం భావిస్తున్నారు.

ఇదీ చదవండి:బ్రిటీష్​ డిప్యూటీ హైకమిషనర్​గా అంబికా!

ABOUT THE AUTHOR

...view details