తెలంగాణ

telangana

ఫ్రాన్స్​లో కరోనా 2.0.​- రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

By

Published : Oct 23, 2020, 11:04 AM IST

corona cases
కరోనా కేసులు

ప్రపంచ దేశాలపై కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం 4.78 లక్షల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 4.20 కోట్లకు చేరువైంది. ఇప్పటి వరకు 11.42 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. ఐరోపాలో వైరస్​ రెండో వేవ్​ ప్రారంభమైన కారణంగా ఫ్రాన్స్​లో రాత్రి కర్ఫ్యూ పొడిగించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు లక్షల మంది వైరస్​ బారిన పడుతున్నారు. గురువారం 4.78 లక్షల మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 4.20 కోట్లకు చేరువైంది.

  • మొత్తం కేసులు: 41,994,442
  • మరణాలు: 1,142,744
  • యాక్టివ్​ కేసులు: 9,664,467
  • కోలుకున్నవారు: 31,187,231
  • అమెరికాలో కరోనా వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా రోజు వారి కేసులు 50 వేల లోపునే ఉండగా.. మళ్లీ 70 వేల వరకు చేరాయి. గురువారం 74 వేల కేసులు నమోదయ్యాయి. 973 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 87 లక్షలకు చేరువైంది.
  • బ్రెజిల్​లోనూ వైరస్​ ఉద్ధృతి తగ్గటం లేదు. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారం మరో 31 వేల మందికి వైరస్​ సోకింది. 500 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 53 లక్షలు దాటింది.
  • రష్యాలో కరోనా కేసుల సంఖ్య 15 లక్షలకు చేరువైంది. కొత్తగా దాదాపు 16 వేల కేసులు నమోదయ్యాయి. 290 మంది మరణించారు.
  • స్పెయిన్​, అర్జెంటీనాల్లో వైరస్​ కేసుల సంఖ్య 10 లక్షలు దాటాయి.
  • ఫ్రాన్స్​లో కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ఆ దేశ ప్రధాని జీన్​ కాస్టెక్స్​. దేశంలో కొవిడ్​ రెండో వేవ్​ ప్రారంభమైన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసుల వివరాలు..

దేశం మొత్తం కేసులు మరణాలు
అమెరికా 8,661,651 228,381
బ్రెజిల్​ 5,332,634 155,962
రష్యా 1,463,306 25,242
స్పెయిన్ 1,090,521 34,521
అర్జెంటీనా 1,053,650 27,957
ఫ్రాన్స్​ 999,043 34,210
కొలంబియా 990,270 29,636
పెరు 879,876 33,984

ABOUT THE AUTHOR

...view details