తెలంగాణ

telangana

Afghanistan news: 'ఏం చేస్తావ్‌? చంపుతావా? ఏదీ చంపు'

By

Published : Sep 9, 2021, 7:46 AM IST

తాలిబన్ల దురాగతాలపై అఫ్గాన్ మహిళలు(Afghanistan Taliban) గొంతెత్తి పోరాడుతున్నారు. వారికి ఎదిరించి నిలుస్తున్నారు. తాలిబన్లకు, ఐసిస్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ తాలిబన్‌(Taliban news) ఎక్కుపెట్టిన తుపాకీకి ఓ మహిళ ఎదురొడ్డి నిలిచింది.

taliban woman protests
తాలిబన్ మహిళ నిరసన

తాలిబన్లు కనిపిస్తే చాలు ఆ మహిళలు (Taliban women news) బెదిరిపోయేవారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే గజగజ వణికిపోయేవారు. ఎక్కడ తమపై దాడులు, అత్యాచారాలకు పాల్పడతారోనని భీతిల్లిపోయేవారు. ఇదీ 1996-2001 వరకు తాలిబన్ల పాలనలో అఫ్గాన్‌ (Taliban ruling Afghan) మహిళల దుస్థితి. కానీ కాలం మారింది. మహిళల్లో చైతన్యం పెరిగింది. మరోసారి ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ దురాగత పాలనకు తెరలేపినప్పటికీ.. మా హక్కులను కాలరాసే అధికారం మీకెక్కడిదంటూ ఆ వనితలు (Taliban women rights) నినదిస్తున్నారు. దుష్టమూకల ఆరాచక పాలనకు ఎదురొడ్డుతున్నారు.

ఆగస్టు 15న తాలిబన్లు రాజధాని కాబుల్‌ను ఆక్రమించుకుని దేశాన్ని హస్తగతం (Taliban Afghan takeover) చేసుకున్నారు. దీంతో అఫ్గాన్‌లో రెండోసారి వారి పాలన మొదలైంది. మహిళల హక్కులను కాలరాసే తాలిబన్లు.. ఈసారీ అదే చేశారు. కో-ఎడ్యుకేషన్‌పై ఆంక్షలు (Taliban coeducation) విధించారు. బాలికలకు మహిళలు (Taliban women Education) మాత్రమే విద్య బోధించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా మహిళా స్వేచ్ఛకు భంగం కలిగేలా పలు చర్యలు చేపట్టారు. ఈ అరాచక పాలనపై నారీలోకం భగ్గుమంది. రోడ్లపైకి చేరి నినదిస్తున్నారు. హెరాత్‌ నగరంలో మొదలైన తిరుగుబాటును స్ఫూర్తిగా తీసుకున్న కాబుల్‌ మహిళలు.. మరింత ఉద్ధృతితో ముందుకుసాగుతున్నారు.

మహిళల నిరసన

నిరసనలు

ప్లకార్డులు చేతబూని దుష్టశక్తులకు వ్యతిరేకంగా (women protest in Afghanistan) పోరాడుతున్నారు. విద్య, ఉద్యోగం తదితర రంగాల్లో హక్కుల సాధనతోపాటు దేశంలో కొత్తగా కొలువుదీరనున్న తాలిబన్ల ప్రభుత్వంలో తమకూ భాగస్వామ్యం కల్పించాలంటూ పోరాడుతున్నారు. తాలిబన్లు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నప్పటికీ వెనుకడుగు వేయడం లేదు. అఫ్గానిస్థాన్‌ వ్యహహారాల్లో పాకిస్థాన్‌ జోక్యంతో పాటు తాలిబన్ల చర్యలను నిరసిస్తూ అక్కడి పౌరులు శనివారం పాక్‌ రాయబార కార్యాలయం వద్దకు చేరుకొని గళమెత్తారు. ఇస్లామాబాద్‌, ఐఎస్‌ఐకి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో కాబుల్‌ నగరం (women protest in kabul) మార్మోగిపోయింది. దీంతో ఆ నిరసన కార్యక్రమాలపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ వారు వెనుదిరగలేదు. కొద్దిసేపటికే మళ్లీ తన నిరసనలను కొనసాగించారు.

మహిళల ప్లకార్డుల ప్రదర్శన

వైరల్ ఫొటో

తాజాగా ఓ తాలిబన్‌ ఎక్కుపెట్టిన తుపాకీకి ఎదురొడ్డి నిలిచిన ఓ మహిళ.. ఏం చేస్తావ్‌? చంపుతావా? ఏదీ చంపు.. అనేలా ఎలాంటి భయం లేకుండా అతడికి ఎదురునిలిచిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అఫ్గాన్‌ వ్యహహారాల్లో పాకిస్థాన్‌ జోక్యంతో తగదంటూ.. మంగళవారం పాక్‌ ఎంబసీ వద్ద చేసిన నిరసనల్లో ఈ దృశ్యం ఆవిష్కృతమైనట్లు రాయిటర్స్‌ వార్తాసంస్థ వెల్లడించింది.

తుపాకీకి ఎదురు నిలిచిన అఫ్గాన్ మహిళ

ఇదీ చదవండి:'డిగ్రీ, పీహెచ్​డీ వేస్ట్- మహిళలకు ఆటలు అనవసరం'

ABOUT THE AUTHOR

...view details