తెలంగాణ

telangana

ఆ దేశంలో జనాభా సంక్షోభం.. దారుణంగా దెబ్బతీసిన కరోనా

By

Published : Jan 30, 2022, 5:13 AM IST

Updated : Jan 30, 2022, 7:20 AM IST

Russias population falls: రష్యాలో కొవిడ్‌ విజృంభణ, ఇతరత్రా కారణాలతో.. గతేడాది దేశ జనాభా భారీగా పడిపోయింది. ఏకంగా పది లక్షలకంటే ఎక్కువమంది తగ్గిపోయినట్లు ప్రభుత్వ గణాంకాల సంస్థ 'రోస్‌స్టాట్' తాజాగా వెల్లడించింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత మొట్టమొదటిసారిగా ఈ స్థాయిలో క్షీణత నమోదు కావడం గమనార్హం. కొవిడ్‌ బారినపడే 6.60 లక్షల మంది మరణించినట్లు రోస్‌స్టాట్ తెలిపింది.

russias population falls
రష్యాలో జనాభా సంక్షోభం

Russias population falls: రష్యాకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. కొవిడ్‌ విజృంభణ, ఇతరత్రా కారణాలతో.. గతేడాది దేశ జనాభా భారీగా పడిపోయింది. ఏకంగా పది లక్షలకంటే ఎక్కువమంది తగ్గిపోయినట్లు ప్రభుత్వ గణాంకాల సంస్థ 'రోస్‌స్టాట్' తాజాగా వెల్లడించింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత మొట్టమొదటిసారిగా ఈ స్థాయిలో క్షీణత నమోదు కావడం గమనార్హం. కొవిడ్‌ బారినపడే 6.60 లక్షల మంది మరణించినట్లు రోస్‌స్టాట్ తెలిపింది. 2020లోనూ రష్యా జనాభా 5 లక్షలకుపైగా తగ్గిపోగా.. ఈ సారి పది లక్షలు దాటింది. మందకొడిగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, మాస్కులు ధరించకపోవడం, పరిమిత ఆంక్షలు తదితర కారణాలతో రష్యాలో మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

గత మూడు దశాబ్దాలుగా రష్యా.. తక్కువ జననాల రేటు, తక్కువ ఆయుర్ధాయం సమస్యలతో సతమతమవుతోంది. దీనికి మహమ్మారి తోడవడంతో ప్రస్తుతం స్థానికంగా జనాభా సంక్షోభం ముదిరింది. జనాభా వృద్ధికి ఇక్కడ మహిళల కనిష్ఠ సంతానోత్పత్తి రేటును 2.1గా నిర్ణయించగా.. ప్రస్తుతం 1.5గా మాత్రమే ఉంది. అయితే, సోవియట్ యూనియన్ పతనానంతరం ఆర్థిక అనిశ్చితి కారణంగా 1990ల్లో జననాల రేటు పడిపోగా.. అప్పుడు పుట్టినవారు ప్రస్తుతం తల్లిదండ్రులుగా మారుతుండటంతో ఈ పరిస్థితి నెలకొందని అధికారులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనాభా పెంపుపై ప్రధాన దృష్టి సారించారు. గత డిసెంబర్‌లో పుతిన్‌ మాట్లాడుతూ.. భౌగోళిక, రాజకీయ కోణాల నుంచి చూస్తే దేశానికి 14.6 కోట్ల మంది సరిపోరని, పైగా కార్మిక శక్తికి కొరత ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ప్రభుత్వం.. ఒకటి కంటే ఎక్కువ పిల్లలున్న తల్లిదండ్రులకు నగదు బోనస్‌లు, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది. అయితే.. జనాభా సంక్షోభం ప్రభుత్వ వైఫల్యమేనని మాస్కోలోని హయ్యర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జనాభా శాస్త్ర నిపుణుడు సెర్గీ జఖారోవ్ అన్నారు. ఈ దిశగా సరైన విధివిధానాలు రూపొందించాలని చెప్పారు. మరోవైపు.. భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగానే తక్కువ జననాల రేటు నమోదవుతోందని అక్కడి సామాజిక సంస్థ 'లెవాడా సెంటర్' ప్రతినిధి స్టెపాన్ గోంచరోవ్ తెలిపారు. '2014 నుంచి రష్యాలో జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, అవినీతితో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ప్రజల ఆదాయం, పొదుపులు తగ్గాయి' అని వివరించారు. దీంతో చాలామంది కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం లేదని చెప్పారు.

Russia covid cases

రష్యాలో ఆల్ టైం హై ..

రష్యాలో కొవిడ్​ కేసుల భారీగా పెరుగుతున్నాయి. కేవలం ఒక్క రోజులోనే లక్ష పదివేల కేసులు నమోదు అయ్యాయి. కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కారణంగా ఈ స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ దేశ వైద్యాధికారులు తెలిపిన దాని ప్రకారం రష్యాలో ఒక్కరోజే 1,13,122 కొత్త ఇన్‌ఫెక్షన్‌లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇన్ని కేసులు రావడం ఇదే మొదటిసారని అధికారులు చెప్తున్నారు. ఈ నెల ప్రారంభంతో పోల్చుకుంటే కేసులు సంఖ్య ఏడు రెట్లు పెరిగినట్లు చెప్పారు. వైరస్​ కారణంగా కొత్త 668 మంది చనిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,30,111కి చేరుకుందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:ఆ దేశంలో ఒమిక్రాన్​ కొత్త వేరియంట్​!

Last Updated : Jan 30, 2022, 7:20 AM IST

ABOUT THE AUTHOR

...view details