తెలంగాణ

telangana

పాక్​ సరిహద్దు తెరవాలంటూ అఫ్గాన్​ పౌరుల ఆందోళన- రాళ్లదాడి!

By

Published : Oct 25, 2021, 5:01 AM IST

పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​ మధ్య ఉన్న సరిహద్దును మూసివేయడంపై నిరసన చేపట్టారు అఫ్గాన్ పౌరులు. చమన్‌ సరిహద్దు (Chaman Border News) వద్ద ఆందోళనకు దిగారు.

afghanistan news
అఫ్గానిస్తాన్

ఆఫ్గానిస్థాన్​తో పాకిస్థాన్​కు ఉన్న కీలక సరిహద్దు చమన్‌ క్రాసింగ్‌ (Chaman Border News) వద్ద ఆప్గాన్ జాతీయులు ఆందోళన చేస్తూ రాళ్లు రువ్వారు. ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దును మూసివేయడంపై (Pak Afghan Border News) నిరసన వ్యక్తం చేశారు. ఘర్షణతో అప్రమత్తమైన పాకిస్థాన్ భద్రతా దళాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి.

అక్టోబర్‌ 5 నుంచి చమన్‌ సరిహద్దును (Afghanistan Latest News) మూసివేసినందున.. రోజుల తరబడి పడిగాపులు గాస్తున్నామని ఆప్గానీయులు చెబుతున్నారు. వందల మంది సరిహద్దును తెరవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:తాలిబన్ల దుశ్చర్య.. జాతీయ క్రీడాకారిణి తల నరికి..

ABOUT THE AUTHOR

...view details