తెలంగాణ

telangana

ఐరాసలో కశ్మీర్​పై ఇమ్రాన్​ పాతపాట- భారత్​ వాకౌట్

By

Published : Sep 26, 2020, 8:06 AM IST

ఐక్యరాజ్యసమితి వేదికగా జమ్ముకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన పాక్‌కు భారత్‌ గట్టి హెచ్చరికలు జారీచేసింది. పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ ప్రసంగం సమయంలో భారత ప్రతినిధి హాల్​ నుంచి వాకౌట్ చేసి నిరసన తెలిపారు. పాకిస్థాన్‌ పదేపదే విద్వేష ప్రచారాన్ని కొనసాగిస్తున్నదని ఐరాసలో భారత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి మండిపడ్డారు.

Indian delegate at the UN General Assembly Hall walked out when Pakistan PM began his speech
ఐరాస సమావేశం నుంచి వాక్​ఔట్​ చేసిన భారత్​!

ఐక్యరాజ్యసమితి 75వ సర్వసభ్య సమావేశంలో కశ్మీర్​ అంశంపై పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ వ్యాఖ్యలపై భారత్​ గట్టిగా స్పందించింది. ఇమ్రాన్​ ప్రకటనలకు ప్రతిస్పందన ఇచ్చేందుకు 'రైట్​ టూ రిప్లై' అవకాశాన్ని ఇవ్వాలని ఐరాసను కోరింది.

ఇమ్రాన్ ఖాన్ ముందే రికార్డ్ చేసిన ప్రకటన చేస్తున్న సమయంలో భారత ప్రతినిధి మిజిటో వినిటో సమావేశ హాల్​ నుంచి వాకౌట్ చేసి.. ఇండియా వైఖరిని స్పష్టం చేశారు.

ఐరాస సమావేశం నుంచి వాక్​ఔట్​ చేసిన భారత్​!

"భారత్​లో జమ్ముకశ్మీర్​ కేంద్రపాలిత ప్రాంత అంతర్భాగం. విడదీయలేని అంగం. జమ్ముకశ్మీర్​లో తీసుకొచ్చిన చట్టాలు, నిబంధనలు పూర్తిగా భారత్​ అంతర్గత వ్యవహారం. కశ్మీర్​కు సంబంధించి ఏదైనా వివాదం ఉందంటే.. అది పాక్​ ఆక్రమణలో ఉన్న కశ్మీర్​ గురించే. కశ్మీర్​లో​ పాక్​ అక్రమ ఆక్రమించుకున్న అన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలి" అని భారత్ ఘాటుగా బదులిచ్చింది.

ఆర్టికల్ 370 రద్దుపై ఇమ్రాన్​..

అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ తన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు.

"పాకిస్థాన్​ ఎల్లప్పుడూ శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంది. ఈ దిశగా 2019 ఆగస్టు 5న భారత్ తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలి. జమ్ముకశ్మీర్​లో సైనిక మోహరింపు, మానవ హక్కుల ఉల్లంఘనలకు స్వస్తి పలకాలి."

- ఇమ్రాన్ ఖాన్​, పాక్ ప్రధాని

అన్నీ అబద్ధాలే..

పాకిస్థాన్‌ పదేపదే విద్వేష ప్రచారాన్ని కొనసాగిస్తున్నదని ఐరాసలో భారత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి మండిపడ్డారు. ఇమ్రాన్‌ఖాన్‌ జమ్ముకశ్మీర్‌పై చేసిన ప్రసంగం పూర్తిగా అబద్ధాలు, అసత్యాలతో కూడుకున్నదని మండిపడ్డారు.

ఇదీ చూడండి:నిరసనకారుడి తలపైకి సైకిల్​ ఎక్కించిన పోలీస్​

ABOUT THE AUTHOR

...view details