తెలంగాణ

telangana

నడిరోడ్డుపై దారుణం.. నలుగురు మహిళలను వివస్త్రలను చేసి దాడి

By

Published : Dec 8, 2021, 1:37 PM IST

Woman Stripped: మానవత్వం మంటగలిసింది. బహిరంగంగా.. నలుగురు మహిళలను వివస్త్రలను చేసి దారుణంగా కొట్టారు కొందరు వ్యక్తులు. బాధితులు.. ఎంత ప్రాధేయపడినా నిందితులు విడిచిపెట్టలేదు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాలను కుదిపేసింది.

4 women stripped, thrashed on allegations of shoplifting in Pakistan
మార్కెట్లో వివస్త్రలను చేసి, దాడి

Woman Stripped: దుకాణంలో చోరీకి పాల్పడేందుకు వచ్చారన్న అనుమానంతో ఓ యువతి సహా నలుగురు మహిళలను వివస్త్రలను చేసి, వీధిలో ఊరేగించి, తీవ్రంగా కొట్టారు! తమను విడిచిపెట్టాలని, దుస్తులు ఇవ్వాలని బాధితులు ఎంతగా ప్రాధేయపడినా ఎవరూ వినిపించుకోలేదు. పైగా వారిని కర్రలతో తీవ్రంగా చితకబాదారు. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలను కుదిపేసింది. కాగా, ఘటనకు సంబంధించి ఐదుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

దుస్తులు విప్పుతుండగా వీడియోలు..

వ్యర్థాలను ఏరుకోవడానికి అని బాధితులు సోమవారం.. ఫైసలాబాద్‌లోని బావా చౌక్‌ మార్కెట్‌కు వెళ్లారు. దాహం వేయడంతో ఉస్మాన్‌ ఎలక్ట్రిక్‌ స్టోర్‌లోనికి వెళ్లి మంచి నీళ్లు అడిగారు. అయితే, దొంగతనం చేయడానికే వారు వచ్చారంటూ దుకాణ యజమాని సద్దాం, మరికొందరు వారిపై దాడికి పాల్పడ్డారు. రపరపా వారిని వీధిలోకి లాక్కొచ్చి, బట్టలు ఊడదీసి, సుమారు గంటపాటు అలాగే తిప్పారు. వస్త్రాలు తొలగిస్తున్నప్పుడు చాలామంది గుమిగూడి వీడియోలు తీశారే తప్ప, ఎవరూ ఆ దుశ్చర్యను అడ్డుకోలేదు!

తమను విడిచిపెట్టాలని బాధితులు విలపించినా, ఒళ్లు దాచుకునేందుకు చిన్న గుడ్డముక్క ఇవ్వాలని పదేపదే ప్రాధేయపడినా ఎవరూ కనికరించలేదు. ఇది దురదృష్టకర ఘటన అని, దాడికి పాల్పడినవారిని విడిచిపెట్టబోమని ఫైసలాబాద్‌ పోలీసు ఉన్నతాధికారి డా.అబిద్‌ ఖాన్‌ మంగళవారం పేర్కొన్నారు.

ఇదీ చూడండి: చెల్లి పెళ్లికి వారం ముందే అన్న ఆత్మహత్య- నగలు కొనేందుకు లోన్​ రాలేదని...

ABOUT THE AUTHOR

...view details