తెలంగాణ

telangana

ట్రంప్​పై వేటు కోసం అభిశంసన అస్త్రం!

By

Published : Jan 8, 2021, 10:45 AM IST

Updated : Jan 8, 2021, 11:21 AM IST

క్యాపిటల్​ ఘటన అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై ఆలోచనలు చేస్తున్నారు కాంగ్రెస్ సభ్యులు. మరోవైపు ఘటనకు బాధ్యత వహిస్తూ ఇద్దరు కేబినెట్ సభ్యులు రాజీమానా చేశారు.

US House Speaker calls for invoking 25th Amendment to remove Trump from office
ట్రంప్​ను తొలగించేందకు రెండో అభిశంసన తీర్మానం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పదవీ కాలం ముగియడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. అయితే గురువారం క్యాపిటల్​ భవనంలో హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో ట్రంప్​ను పదవి నుంచి తొలగించే విషయమై ఇరు పార్టీల చట్టసభ్యులు విస్తృతంగా చర్చించారు. ఆయన్ను తొలగించకపోతే సభ రెండో అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతుందని స్పీకర్ నాన్సీ పెలోసి వ్యాఖ్యానించారు. దీనిపై ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్, ఇతర కేబినెట్​ అధికారుల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు స్పీకర్​ పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని 25వ సవరణను అమలు చేసి.. తక్షణమే ట్రంప్‌ను తొలగించాలని పెన్స్​ను కోరారు కాంగ్రెస్​లోని​ డెమొక్రటిక్ పార్టీ నేతలు. (25వ సవరణ ప్రకారం.. కేబినేట్​లో మెజారిటీ సభ్యులు కోరిక మేరకు అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే అధికారం ఉపాధ్యక్షుడికి ఉంటుంది). ప్రమాదకరమైన దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్న ఆరోపణతో ట్రంప్​ను కార్యాలయం నుంచి బయటకు పంపించాలని వారు కోరారు.

'ట్రంప్​ తప్పు అంగీకరించాలి'

క్యాపిటల్​ భవనం వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో తన పాత్ర ఉన్నట్లు ట్రంప్ ఒప్పుకోవాలన్నారు రిపబ్లికన్​ పార్టీ సెనెటర్ లిండెసే గ్రహం. ట్రంప్​కు సహాయంగా ఉన్నందుకు బాధపడట్లేదు. కానీ ట్రంప్​ది స్వయంకృత అపరాదమేనని ఆయన వ్యాఖ్యానించారు.

కేబినెట్​ సభ్యుల రాజీనామా

క్యాపిటల్​ ఘటనకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి బెస్టీ దేవోస్​, రవాణా మంత్రి ఎలైన్​ ఛావోలు తమ పదవులకు రాజీనామా చేశారు.

క్యాపిటల్​ పోలీసు చీఫ్​ స్టీవెన్​ సుండ్​ కూడా ఈ నెలలో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. భవనంలోకి ప్రవేశించిన ట్రంప్​ మద్దతుదారులను అడ్డుకోవడంలో విఫలమవడంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయిం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:అమెరికాలో హింసపై ప్రపంచదేశాల ఆందోళన

Last Updated : Jan 8, 2021, 11:21 AM IST

ABOUT THE AUTHOR

...view details