తెలంగాణ

telangana

దద్దుర్లు కూడా కరోనా లక్షణమే!

By

Published : Jul 21, 2020, 9:37 PM IST

శరీరంపై దద్దుర్లు రావడం, కాలివేళ్లు ఎరుపెక్కడం కూడా కరోనా లక్షణాలుగా భావించవచ్చని తాజాగా విడుదలైన ఓ అధ్యయనం పేర్కొంది. ఎవరికైనా దద్దుర్లు లాంటి చర్మ వ్యాధులు వస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమమని సూచించింది.

Purple toes, rashes can also be signs of COVID-19: Study
దద్దుర్లు కూడా కరోనా లక్షణం కావచ్చు!

శరీరంపై అకస్మాత్తుగా దద్దుర్లు రావడం, కాలివేళ్లు ఎర్రబడడం లాంటి చర్మ మార్పులను కూడా కరోనా లక్షణాలుగా భావించవచ్చని ఓ తాజా అధ్యయనం పేర్కొంది. 12 శాతం మంది కరోనా రోగుల్లో దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సాధారణ లక్షణాలతో పాటు ఇవి కనిపించగా.. మిగతా వారిలో లేవని ఆ నివేదిక వెల్లడించింది.

అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ, ఇంటర్నేషనల్​ లీగ్ ఆఫ్ డెర్మటోలాజిక్ సొసైటీల సహకారంతో... మసాచ్యుసెట్స్ జనరల్ హాస్పిటల్​ (ఎంజీహెచ్​), హార్వర్డ్ మెడికల్ స్కూల్ (హెచ్​ఎంఎస్​) పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. కరోనా ఇన్​ఫెక్షన్లతో సంబంధం ఉన్న చర్యవ్యాధుల గురించి వివరించడానికి, వాటి జాబితా తయారుచేయడానికి... వీరు ఒక అంతర్జాతీయ రిజిస్ట్రీని రూపొందించారు.

"ఈ రిజిస్ట్రీ... ఏఏ చర్మ వ్యాధులను కరోనా లక్షణాలుగా గుర్తించవచ్చో తెలుపుతుంది. కొవిడ్-19 వైరస్ నిర్దిష్టంగా ఒక రకమైన దద్దుర్లు కలిగిస్తుందని చెప్పలేం. అయితే అది రకరకాల దద్దుర్లు కలిగిస్తుందని మాత్రం గుర్తించాం."

- ఎస్తేర్ ఈ ఫ్రీమెన్, పరిశోధకుడు

ఇలా నిర్ధరణ..

716 కరోనా కేసులపై చేసిన పరిశోధనల్లో... కరోనా రోగులకు చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్లు వస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా 171 మంది పాజిటివ్ రోగులపై చేసిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో ఈ విషయం నిరూపణ అయ్యింది.

దాదాపు 22 శాతం మంది కరోనా రోగుల్లో.. సర్వసాధారణమైన చర్మ వ్యాధి మీజిల్స్ (మోర్బిలిఫాం) లాంటి దద్దుర్లు కనిపించాయి. అలాగే 18 శాతం మంది కొవిడ్ రోగుల్లో... చల్లని గాలి తగిలితే...వారి కాలి వేళ్లు ఎరుపెక్కడం, కాలి మడమలు, వేళ్లపై లేత గడ్డలు రావడం, అక్కడ దురద పెట్టడం లాంటి లక్షణాలు కనిపించాయి. ముఖ్యంగా తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నవారిలో ఇవి కనిపించాయి. అందువల్ల ఎవరికైనా దద్దుర్లు లాంటి చర్మ వ్యాధులు వస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదని ఎస్తేర్ ఈ ఫ్రీమెన్ సూచించారు.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్​: ఈ ఏడాది అమర్​నాథ్​ యాత్ర రద్దు

ABOUT THE AUTHOR

...view details