తెలంగాణ

telangana

రికార్డు సృష్టించిన ఒబామా 'ఏ ప్రామిస్డ్​ ల్యాండ్​'

By

Published : Nov 25, 2020, 9:02 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా రాసిన పుస్తకం 'ఏ ప్రామిస్డ్​ ల్యాండ్​' రికార్డు స్థాయిలో అమ్ముడవుతోంది. ఇప్పటికే ఉత్తర అమెరికాలో 17 లక్షల కాపీలకు పైగా అమ్ముడైంది. అమెరికా అధ్యక్షులు రాసిన పుస్తకాల్లో అత్యధికంగా కొనుగోలు అవుతూ రికార్డు సృష్టిస్తోంది.

Obama memoir sells record 1.7 million copies in first week
సరికొత్త రికార్డు సృష్టించిన ఒబామా 'ఏ ప్రామిస్డ్​ ల్యాండ్​'

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వీయ అనుభవాలతో రాసిన 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' పుస్తకం రికార్డు స్థాయిలో అమ్ముడవుతోంది. ఇప్పటివరకు అమెరికా అధ్యక్షులు రాసిన పుస్తకాల్లో అత్యధికంగా కొనుగోలు అవుతున్న పుస్తకంగా 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' రికార్డు సృష్టిస్తోంది. కేవలం ఉత్తర అమెరికాలోనే 17 లక్షలు కాపీలు అమ్ముడుకావడం విశేషం.

ప్రచురణ సంస్థ అయిన క్రౌన్​ మరిన్ని కాపీలను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. మొదటి ముద్రణలో భాగంగా చేసిన 34 లక్షల కాపీలను 43 లక్షలకు పెంచినట్లు ప్రకటించింది. ఆ పుస్తకాన్ని కేవలం చదవడానికే కాక వినడానికి కూడా ఏర్పాట్లు చేసింది ఈ సంస్థ.

రెండు భాగాలుగా రానున్న ఈ పుస్తకం విడుదల అయిన మొదటి రోజులోనే ఎనిమిది లక్షల 90వేల కాపీలు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఇప్పుటివరకు శ్వేతసౌధంలో ఉన్న వారు రాసిన పుస్తకాల్లో ఒబామా భార్య మిచెల్​ ఒబామా రాసిన 'బికమింగ్​' ఎక్కువ ప్రజాదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా కోటికి పైగా కాపీలు అమ్ముడు కావడమే కాక అమెజాన్​.కామ్​లో టాప్​ 20లో ఉంది.

అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి.డబ్ల్యూ.బుష్​ రాసిన 'డెషిషన్​ పాయింట్స్​', బిల్​క్లింటన్​ రాసిన 'మై లైఫ్​' పుస్తకాలు అధిక మొత్తంలో అమ్ముడైనా ఒబామా పుస్తకం మాత్రం వారి రికార్డును సులువుగా వెనక్కి నెట్టింది.

ఇదీ చూడండి: యూపీ సివిల్​ కోర్టులో ఒబామాపై పిటిషన్

ABOUT THE AUTHOR

...view details