తెలంగాణ

telangana

'ఒమిక్రాన్​ను చూసి భయాందోళనకు గురి కావొద్దు'

By

Published : Nov 30, 2021, 2:07 AM IST

Updated : Nov 30, 2021, 5:24 AM IST

Biden
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

కొత్త రూపంలో వచ్చిన కరోనా వేరియంట్​ వల్ల భయాందోళనకు గురుకావొద్దన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. దీనిని ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలను అమలుపరుస్తామని హామినిచ్చారు.

కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్​ను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు మహమ్మారిపై ఎలా పోరాడాలో వివరిస్తూ.. ప్రత్యేక వ్యూహాన్ని తయారుచేయనున్నట్లు తెలిపారు. ఈ వేరియంట్​ను చూసి భయం, కంగారు పడొద్దని ప్రజలకు సూచించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

"కొత్త వేరియంట్ అమెరికాకు చేరుకుంటుంది. అందులో సందేహం లేదు. అయితే మనల్ని మనం రక్షించుకునేందుకు దేశంలో అవకాశాలున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్‌లు, బూస్టర్ షాట్‌ల పంపిణీని వేగవంతం చేయాలి. లాక్‌డౌన్‌లతో కాకుండా మరింత విస్తృతమైన వ్యాక్సినేషన్, బూస్టర్‌ డోసుల పంపిణీ, నిర్ధరణ పరీక్షల పెంపు వంటి అస్త్రాలతో కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొందాం."

--జో బైడెన్

మరోవైపు.. బహిరంగ ప్రదేశాలతో పాటు.. ఇంట్లోనూ ఫేస్ మాస్క్‌లు ధరించాలని దేశ ప్రజలకు బైడెన్ విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 30, 2021, 5:24 AM IST

ABOUT THE AUTHOR

...view details