తెలంగాణ

telangana

బడి ప్రాంగణంలో 215 అస్థిపంజరాలు

By

Published : May 30, 2021, 6:35 AM IST

కెనడాలో దారుణం జరిగింది. ఓ పాఠశాల ప్రాంగణంలో ఒకేసారి 215 మంది పిల్లల అస్థి పంజరాలు బయటపడ్డాయి. పాఠశాల ప్రాంగణంలో మరిన్ని చోట్ల ఇంకా తవ్వకాలు జరగాల్సి ఉన్నందున అస్థి పంజరాల లెక్క ఎంతవరకు వెళ్తుందనేది తెలియడం లేదు. దేశంలో ఒకప్పుడు ఇదే అతిపెద్ద విద్యాసంస్థ. ఈ ఆశ్రమ పాఠశాల 1890 నుంచి 1969 వరకు కేథలిక్‌ చర్చి పర్యవేక్షణలో నడిచేది. ఒకప్పుడు ఇక్కడి పాఠశాలల్లో బలవంతపు మత మార్పిళ్లు జరిగేవనీ, మాట విననివారిని తీవ్రంగా కొట్టేవారనీ చెబుతారు.

canada
కెనడా

కెనడాలో దారుణం వెలుగు చూసింది. పేరు ప్రఖ్యాతులున్న 'కామ్‌లూప్స్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌' ప్రాంగణంలో ఒకేసారి 215 మంది పిల్లల అస్థి పంజరాలు బయటపడ్డాయి. మృతుల్లో కొందరు మూడేళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. ఒక రాడార్‌ ద్వారా లభ్యమైన సమాచారంతో ఈ దారుణం వెలుగు చూసింది. పాఠశాల ప్రాంగణంలో మరిన్ని చోట్ల ఇంకా తవ్వకాలు జరగాల్సి ఉన్నందున అస్థి పంజరాల లెక్క ఎంతవరకు వెళ్తుందనేది తెలియడం లేదు.

దేశంలో ఒకప్పుడు ఇదే అతిపెద్ద విద్యాసంస్థ. దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలవారు తమ పిల్లల్ని ఇక్కడ చదివించేవారు. కెనడాకు చెందిన పిల్లల పట్ల విద్యాసంస్థల్లో దారుణాలు జరిగాయంటూ ఐదేళ్ల క్రితం నిజ నిర్ధరణ కమిషన్‌ ఒకటి నివేదిక వెలువరించింది. సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల కనీసం 3200 మంది పిల్లలు చనిపోయి ఉంటారని, ఒక్క కామ్‌లూప్స్‌ పాఠశాలలోనే 1915-1963 మధ్య 51 మరణాలు చోటు చేసుకుని ఉండవచ్చని ఆ నివేదిక పేర్కొంది.

'బలవంతపు మత మార్పిళ్ల వలనే!?'

ఆ బడిలో అంతకుమించిన స్థాయిలో ఏదో ఘాతుకం జరిగినట్లు తాజా పరిణామం చాటుతోంది. దేశీయంగా బాలల సామూహిక హత్యాకాండ సాగిందన్న అనుమానాలకు బలం చేకూరేలా తాజా ఘటన నిలుస్తోంది. ఇక్కడ తమ పిల్లల్ని చదివించిన వారికి ఈ దారుణకాండ గురించి సమాచారాన్ని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ఆశ్రమ పాఠశాల 1890 నుంచి 1969 వరకు కేథలిక్‌ చర్చి పర్యవేక్షణలో నడిచేది. ఆ తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 1978 వరకు నడిపింది. ఆ తర్వాత ఇది మూతపడింది. ఒకప్పుడు ఇక్కడి పాఠశాలల్లో బలవంతపు మత మార్పిళ్లు జరిగేవనీ, మాట విననివారిని తీవ్రంగా కొట్టేవారనీ చెబుతారు. ఇలాంటి చర్యల వల్ల కనీసం 6,000 మంది చనిపోయి ఉంటారని ఒక అంచనా.

ఇదీ చదవండి:కెనడా టొరంటో బిల్​ బోర్డులపై మోదీ

ABOUT THE AUTHOR

...view details