తెలంగాణ

telangana

కొవిడ్​ విధ్వంసం- ఇరాన్​లో 50వేలు దాటిన మరణాలు

By

Published : Dec 5, 2020, 9:24 PM IST

ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. ఇప్పటివరకు 6కోట్ల 63లక్షలకుపైగా వైరస్​ కేసులు నమోదయ్యాయి. వారిలో 15లక్షల 27వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్​, రష్యాలలో కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది.

Iran's virus deaths pass 50,000 as lockdown on capital eases
కొవిడ్​ విధ్వంసం- ఇరాన్​లో 50వేలు దాటిన మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు 6.63 కోట్ల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. వారిలో 15.27లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. ఇప్పటివరకు 4కోట్ల 59లక్షల మంది కొవిడ్​ను జయించగా.. కోటీ 89లక్షల యాక్టివ్​ కేసులున్నాయి.

  • కరోనా కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో వైరస్​ విలయతాండవం కొనసాగుతోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 14.78 లక్షల కేసులు నమోదయ్యాయి. వారిలో 2.85లక్షల మందిని కొవిడ్​ బలితీసుకుంది.
  • రష్యాలో వైరస్​ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 28,782 మందికి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24లక్షల 31వేలు దాటింది. ఆ దేశంలో ఇప్పటివరకు 42,684 కరోనా మరణాలు సంభవించాయి.
  • ఇరాన్​లో కొవిడ్​ మృతుల సంఖ్య 50వేలు దాటింది. లాక్​డౌన్​ ఆంక్షలను సడలించడం వల్లే వైరస్​ మరణాలు పెరిగిపోతున్నాయని అక్కడి అధికారులు వెల్లడించారు. ఆ దేశంలో ఇప్పటివరకు 10లక్షల 28వేలకుపైగా వైరస్ కేసులు వెలుగుచూశాయి.
  • పొరుగుదేశం నేపాల్​లో మరో 1,024 మందికి కరోనా సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 2.39లక్షలకు ఎగబాకింది. మహమ్మారి ధాటికి మరో 10 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య 1,577కు చేరింది.

కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలివే..

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు
అమెరికా 1,47,81,043 2,85,738
బ్రెజిల్​ 65,34,951 1,75,981
రష్యా 24,31,731 42,684
ఫ్రాన్స్​ 22,68,552 54,767
స్పెయిన్​ 16,99,145 46,252
బ్రిటన్​ 16,90,432 60,617
ఇటలీ 16,88,939 58,852
అర్జెంటీనా 14,54,631 39,512
కొలంబియా 13,52,607 37,467

ఇదీ చదవండి:'టీకా గురించి అలా అనలేదు క్షమించండి'

ABOUT THE AUTHOR

...view details