తెలంగాణ

telangana

అమెరికాలో కార్చిచ్చు బీభత్సం- 14 వేల చ.కిమీ దగ్ధం

By

Published : Sep 22, 2020, 2:31 PM IST

అమెరికాలో కొన్ని రోజులగా కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. దావానలం కారణంగా అక్కడి ప్రజలకు పగలు రాత్రి తేడా తెలియడం లేదు. వేలాది ఇళ్లు దగ్ధమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Enormous California wildfire threatens desert homes near LA
కాలిఫోర్నియా చరిత్రలోనే ఐదవ అతిపెద్ద కార్చిచ్చు!

అమెరికాలో కార్చిచ్చు బీభత్సం కొనసాగుతోంది. లాస్​ ఏంజిల్స్​ ఈశాన్య ప్రాంతంలో ఉన్న పర్వతాల నుంచి మొదలైన కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. కాలిఫోర్నియా చరిత్రలో ఇప్పటివరకు చూసిన అతిపెద్ద కార్చిచ్చుల్లో ఇది ఒకటి. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఐదో అతిపెద్ద దావానలమని అధికారులు తెలిపారు.

కాలిఫోర్నియా చరిత్రలోనే ఐదవ అతిపెద్ద కార్చిచ్చు!
  • ఇప్పటికే 14,500 చదరపు కిమీ భూభాగం కాలిపోయింది. కనక్టికట్ అనే రాష్ట్ర వైశాల్యం కంటే ఇది ఎక్కువ.
    అలుముకుంటున్న దట్టమైన పొగ
  • ఫుట్ హిల్, ఎడారి ప్రాంతాల్లో ఉన్న వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.
    వ్యాపిస్తున్న మంటలు
  • వందలాది ఇళ్లు, ప్రఖ్యాత అభయారణ్యాలు ఇప్పటికే బూడిదయ్యాయి.
  • ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 23,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
  • ఈ కార్చిచ్చు ధాటికి 6,400 ఇళ్లు దగ్ధమయ్యాయి.
  • మొత్తం 19 వేల అగ్నిమాపక వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా రాజుకున్న 27 కార్చిచ్చులను అదుపుచేసేందుకు యత్నిస్తున్నాయి.
    మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
  • ఈ ఏడాదిలో ఇప్పటికే 7900 కార్చిచ్చులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details