తెలంగాణ

telangana

ఐరాస మీటింగ్‌లో డైనోసర్‌- ప్రపంచ నేతలకు వార్నింగ్

By

Published : Oct 28, 2021, 4:00 PM IST

ఎన్నో ఏళ్ల కింద అంతరించిపోయిన డైనోసర్​ మళ్లీ ప్రత్యక్షమైంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (Dinosaur at united nations) జరుగుతుండగా.. ఓ డైనోసర్​ వచ్చింది. అది చూసి ప్రపంచ నేతలు, పలు దేశాల ప్రతినిధులు ఉలిక్కిపడ్డారు. పోడియంపైకి (Dinosaur at un meeting) వెళ్లి అది​ ప్రజలను హెచ్చరించింది. వినాశనాన్ని కొనితెచ్చుకోకుండా.. జాతిని కాపాడుకోండి అని చెప్పి సెలవిచ్చింది. అసలు డైనోసర్లు రావడం ఏంటని ఆలోచిస్తున్నారా? ఇది చూసేయండి.

dinosaur-takes-to-un-general-assembly-podium-to-tell-world-leaders
ఐరాస మీటింగ్‌లో డైనోసర్‌

అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి (Dinosaur at united nations) అనూహ్య అతిథి హాజరైంది. ఐరాస జనరల్‌ అసెంబ్లీ జరిగే కావెర్‌నోస్‌ హాల్‌లోకి డైనోసర్‌ వచ్చింది. దీంతో ఆ సమావేశంలో పాల్గొన్న ప్రపంచ నేతలు, పలు దేశాల దౌత్యవేత్తలు భయంతో ఉలిక్కిపడ్డారు. అక్కడి నుంచి నేరుగా పోడియం వద్దకు వెళ్లిన ఆ డైనోసర్‌(Dinosaur at united nations) మానవాళిని ఉద్దేశించి ప్రసంగించింది. ఈ సందర్భంగా ప్రపంచంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులపై(Dinosaur at un meeting) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆ జీవి.. ''వినాశనాన్ని ఎంచుకోకండి.. మానవజాతిని కాపాడుకోండి'' అంటూ విజ్ఞప్తి చేసింది(United Nations General Assembly).

''వినండి ప్రజలారా..! వినాశనం అనేది చాలా చెడ్డ విషయం. అది మిమ్మల్ని (మానవాళిని ఉద్దేశిస్తూ) అంతరించిపోయేలా చేస్తుంది. ఈ 70 మిలియన్‌ సంవత్సరాల్లో నేను విన్న అత్యంత తెలివితక్కువ విషయం ఇదే. మీరు వాతావరణ విపత్తు వైపు వెళ్తున్నారు. ఇంకా ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు శిలాజ ఇంధనాల సబ్సిడీల కోసం ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. కానీ, ఆ మొత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో మగ్గిపోతున్న ప్రజలకు సాయంగా ఎందుకు ఉపయోగించట్లేదు..? వారికి సాయం చేయడం మరింత ఉత్తమం అని మీకు అనిపించలేదా? మీ జాతి వినాశనానికి ఎందుకు డబ్బులు ఖర్చు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు, మీ ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించుకునేందుకు మీకు గొప్ప అవకాశం లభించింది. ఇది మానవాళికి గొప్ప అవకాశం. దానికి నాదో సలహా.. వినాశనాన్ని ఎంచుకోకండి. ఆలస్యం కాకముందే మీ జాతిని కాపాడుకోండి. ఇకనైనా సాకులు చెప్పడం మాని.. మార్పులను ప్రారంభించాల్సిన సమయం ఇది.'' అని డైనోసర్‌ (United Nations General Assembly) సందేశమిచ్చింది.

అయితే ఇది నిజంగా జరగలేదు. వాతావరణ మార్పులపై ప్రపంచానికి అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్(యూన్‌డీపీ) చేసిన మాయ ఇది. పర్యావరణ మార్పులపై ఐరాసలో సమావేశం జరగనున్న నేపథ్యంలో యూఎన్‌డీపీ.. ఈ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించింది. గ్రాఫిక్స్‌లో డిజైన్‌ చేసిన ఈ వీడియోలో డైనోసర్‌కు(Dinosaur at united nations) ప్రముఖ సెలబ్రిటీలు పలు భాషల్లో గాత్రం అందించారు. ఈ వీడియోను ఐరాస తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేయగా.. విపరీతమైన ఆదరణ లభించింది. డైనోసర్‌ నిజంగా వచ్చి మాట్లాడినట్లుగా చూపించడం విశేషం.

ఇదీ చూడండి:తండ్రి అంత్యక్రియల్లో కూతురు ఫొటోషూట్​.. శవపేటిక ముందు..!

ABOUT THE AUTHOR

...view details