తెలంగాణ

telangana

ఆ రాష్ట్రాల్లో వందల ఎకరాల అడవి దగ్ధం

By

Published : Jun 15, 2021, 4:13 PM IST

అమెరికాలో మరోసారి కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. దక్షిణ కాలిఫోర్నియా, ఉటా రాష్ట్రాల్లోని అడవుల్లో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్లతో నీటిని తెచ్చి చల్లుతున్నారు అధికారులు.

wildfire
కార్చిచ్చు

కార్చిచ్చు

అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. వెంచురా కౌంటీ ప్రాంతంలో కార్చిచ్చు వ్యాప్తి చెందుతోంది. హెలికాప్టర్​ ద్వారా 93 కిలోమీటర్ల దూరంలో లాస్​ ఏంజెల్స్​లో ఉన్న కాసిటాస్​ నది నుంచి నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.

దగ్ధమైన అడవి
వ్యాపిస్తోన్న కార్చిచ్చు
పూర్తిగా దగ్ధమైన అడవి

అటవీ పరిసర ప్రాంతాల్లో రెడ్​ ఫ్లాగ్ హెచ్చరికలు జారీ చేశారు. అధిక ఉష్ణోగ్రత కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఉటా రాష్ట్రంలోనూ..

హెలికాప్టర్లతో నీళ్లు చల్లి..
రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది
నది నుంచి నీరు తెచ్చి..

ఉటా రాష్ట్రంలోనూ కార్చిచ్చు చెలరేగింది. దాదాపు 300 మంది అగ్నిమాపక సిబ్బందితో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 90 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేశారు.

ఇదీ చదవండి :viral: అడవిలో హాయిగా సేద తీరుతున్న ఏనుగులు

ABOUT THE AUTHOR

...view details