తెలంగాణ

telangana

'కృత్రిమ మేధ పోరులో అమెరికాపై చైనాదే పైచేయి'

By

Published : Oct 12, 2021, 7:52 AM IST

US CHINA ai fight
అమెరికా చైనా ఏఐ పోరు ()

కృత్రిమ మేధస్సు పోరులో (US China AI race) అగ్రరాజ్యంపై చైనా పైచేయి సాధించిందని పెంటగాన్ మాజీ చీఫ్ సాఫ్ట్‌వేర్ ఆఫీసర్‌ నికోలస్‌ చైలాన్‌ పేర్కొన్నారు. (US China AI competition) రానున్న దశాబ్దంలోపే కృత్రిమ మేధస్సు, సింథటిక్‌ బయాలజీ, జన్యుశాస్త్రం తదితర అనేక కీలక శాస్త్రసాంకేతిక రంగాల్లో చైనా అగ్రగామిగా నిలిచే అవకాశం ఉందన్న విదేశీ నిఘా సంస్థల అంచనాలను గుర్తుచేశారు. భవిష్యత్తులో డ్రాగన్‌తో అగ్రరాజ్యం పోటీ పడలేదని చెప్పారు.

వాణిజ్యం, ఆర్థికం, సాంకేతికత.. ఇలా ఆయా రంగాల్లో అమెరికా, చైనాలు ఢీ అంటే ఢీ (US China tech war) అంటున్నాయి. అయితే.. కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) పోరులో (US China AI race) మాత్రం అగ్రరాజ్యంపై చైనా పైచేయి సాధించినట్లు పెంటగాన్ మాజీ చీఫ్ సాఫ్ట్‌వేర్ ఆఫీసర్‌ నికోలస్‌ చైలాన్‌ తాజాగా ఓ వార్త సంస్థకు వెల్లడించడం చర్చనీయాంశమైంది. (US China AI war) ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా.. వేగవంతమైన సాంకేతిక పురోగతితో ప్రపంచ ఆధిపత్యం వైపు దూసుకెళ్తోందన్నారు. (US China AI competition) రానున్న దశాబ్దంలోపే కృత్రిమ మేధస్సు, సింథటిక్‌ బయాలజీ, జన్యుశాస్త్రం తదితర అనేక కీలక శాస్త్రసాంకేతిక రంగాల్లో 'డ్రాగన్‌' అగ్రగామిగా నిలిచే అవకాశం ఉందన్న విదేశీ నిఘా సంస్థల అంచనాలను గుర్తుచేశారు. (US vs China AI)

'గూగుల్‌ వంటి సంస్థలు సహకరించడం లేదు..'

ప్రపంచ భవిష్యత్తుపై ఆధిపత్యం చెలాయించేందుకు చైనా సిద్ధంగా ఉందని.. మీడియా కథనాల నుంచి భౌగోళిక రాజకీయాల వరకు అన్నింటినీ ఆ దేశం నియంత్రిస్తోందని నికోలస్‌ వ్యాఖ్యానించారు. రానున్న 15- 20 ఏళ్లలో అమెరికా.. చైనాతో పోటీపడే అవకాశం లేదని పేర్కొన్నారు. అగ్రరాజ్యంలో నిదానంగా సాగుతున్న ఆవిష్కరణలు, గూగుల్ వంటి అమెరికా సంస్థలు 'ఏఐ' (US China AI race) విషయంలోనూ స్థానిక ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఇష్టపడకపోవడం, సాంకేతికత నైతిక విలువలపై చర్చలను ఆయన విమర్శించారు. ఇక్కడి కొన్ని ప్రభుత్వ విభాగాల సైబర్ రక్షణ వ్యవస్థలు ఇంకా బాల్య దశలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కానీ, చైనా కంపెనీలు మాత్రం తమ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాయని, నైతికతతో సంబంధం లేకుండా కృత్రిమ మేధలో భారీగా పెట్టుబడులు పెడ్తున్నాయని వివరించారు. (US China AI war)

ఎవరీ చైలాన్..?

నికోలస్‌ చైలాన్‌.. పెంటగాన్‌ మొదటి చీఫ్ సాఫ్ట్‌వేర్ ఆఫీసర్‌ పనిచేశారు. కానీ.. అమెరికా మిలిటరీలో టెక్నాలజీ మార్పు ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటానికి నిరసనగా సెప్టెంబరులో రాజీనామా చేశారు. అనుభవం లేని సైబర్ కార్యక్రమాలకు తమకు పదేపదే బాధ్యతలు అప్పగించారని ఆయన ఆరోపించారు. సాంకేతికత అభివృద్ధి విషయంలో అమెరికా స్పందించకపోతే.. దేశమే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. మరోవైపు ఈ వ్యవహారంపై అమెరికా ఎయిర్ ఫోర్స్ సెక్రెటరీ ఫ్రాంక్ కెండల్.. చైలాన్‌తో మాట్లాడారు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి ఆయన చేసిన సిఫార్సులపై చర్చించినట్లు కెండల్‌ వెల్లడించారు. (US China AI competition)

ఇదీ చదవండి:'రష్యా, చైనా చేతికి అఫ్గాన్​లోని అమెరికా ఆయుధాలు'

ABOUT THE AUTHOR

...view details