తెలంగాణ

telangana

అమెరికాలో 'కొవాగ్జిన్' అత్యవసర వినియోగానికి దరఖాస్తు

By

Published : May 25, 2021, 12:31 PM IST

కొవాగ్జిన్ టీకా అమెరికాలో అత్యవసర వినియోగానికి.. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్​డీఏ)కు భారత్​ బయోటెక్​ భాగస్వామ్య సంస్థ ఓక్యూజెన్‌ దరఖాస్తు చేసింది. ఈ మేరకు కొవాగ్జిన్​పై మాస్టర్​ ఫైల్ సమర్పించినట్లు ఒక్యూజెన్ వెల్లడించింది.

Covaxin
కొవాగ్జిన్

దేశీయ టీకా కొవాక్జిన్‌.. అమెరికాలో అత్యవసర వినియోగానికి తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ భాగస్వామ్య సంస్థ ఓక్యూజెన్‌ దరఖాస్తు చేసింది. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్​డీఏ)కు మాస్టర్‌ ఫైల్‌ సమర్పించినట్లు ఓక్యూజెన్‌ వెల్లడించింది. అత్యవసర వినియోగ అధికారపత్రం బయోలాజిక్‌ లైసెన్స్‌ దరఖాస్తు ఆమోదం కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

ప్రస్తుతం కొవాక్జిన్‌ క్లినికల్‌, రెగ్యులేటరీ ప్రక్రియను మదింపు చేస్తున్నట్లు పేర్కొంది. అమెరికాలో కొవాక్జిన్‌ అభివృద్ధి, సరఫరా, వాణిజ్య వినియోగానికి సంబంధించి ఫిబ్రవరి 2న ఓక్యూజెన్‌తో భారత్‌ బయోటెక్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చదవండి :సీడీ కేసులో కొత్త ట్విస్ట్​.. నిజం ఒప్పుకున్న జార్ఖిహోళి!

ABOUT THE AUTHOR

...view details