తెలంగాణ

telangana

అమెరికాలో ఆగని కార్చిచ్చు.. ఒకరు మృతి

By

Published : Sep 19, 2020, 2:53 PM IST

అమెరికాలో పలుచోట్ల చెలరేగిన కార్చిచ్చు ఇప్పటికీ కొనసాగుతోంది. మంటలను అదుపు చేసే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది ఒకరు మృతి చెందారు. వందలాది ఇళ్లు, వేలాది ఎకరాల్లో అడవులు దహించుకుపోయాయి. దావానలం వల్ల వెలువడే పొగ కారణంగా పగలు, రాత్రి తేడా లేకుండా పోయింది.

America wildfires: One of the firefighters was killed while trying to contain the blaze
అమెరికాలో ఆగని కార్చిచ్చు.. ఒకరు మృతి

అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. తూర్పు లాస్‌ఏంజెల్స్‌ ప్రాంతంలో మంటలను అదుపుచేసే క్రమంలో అగ్నికీలల్లో చిక్కుకుని అగ్నిమాపక దళానికి చెందిన సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు
దట్టంగా అలుముకున్న పొగ
విస్తరిస్తున్నకార్చిచ్చు
అమెరికాలో ఆగని కార్చిచ్చు.. ఒకరు మృతి

లాస్‌ఏంజెల్స్‌కు 75 మైళ్ల దూరంలోని శాన్ బెర్నాడినో నేషనల్ ఫారెస్ట్‌లో చెలరేగిన మంటలను అదుపుచేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా అటవీ విభాగం వెల్లడించింది. అతని అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. అటు మొజావే ప్రాంతంలో చెలరేగిన మంటల్లో అనేక ఇళ్లు దగ్ధమయ్యాయి.

ఎగసిపడుతున్న అగ్నికీలలు
కాలిబుడిదైన అడవులు
కార్చిచ్చులో పూర్తిగా దహనమైన ఇల్లు
దగ్ధమైన వాహనాలు
మంటల్లో దగ్ధమైన కారు.. కాలిన చెట్లు

ఇదీ చూడండి:అమెరికా బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు: చైనా

ABOUT THE AUTHOR

...view details