తెలంగాణ

telangana

తమ్మినేని వీరభద్రం కుటుంబం ఓట్లు గల్లంతు

By

Published : Dec 1, 2020, 9:11 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో చాలా ఓట్లు గల్లంతయ్యాయి. బాగ్​అంబర్​పేట్ నియోజకవర్గం ఇంద్ర ప్రస్థాన కాలనీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కుటుంబం ఓట్లు గల్లంతయ్యాయి. ఓటు వేయడానికి వచ్చిన ఆయన ఓటరు జాబితాలో పేరు లేకపోవటంతో వెనుదిరిగారు.

cpm state secretary thammineni veerabadram famly votes in ghmc elections
తమ్మినేని వీరభద్రం కుటుంబం ఓట్లు గల్లంతు

బాగ్​అంబర్​పేట్ నియోజకవర్గం ఇంద్ర ప్రస్థాన కాలనీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కుటుంబం ఓట్లు గల్లంతయ్యాయి. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో ఇదే బూతులో ఓటు వేశామని తమ్మినేని వీరభద్రం అన్నారు.

తమ్మినేని వీరభద్రం కుటుంబం ఓట్లు గల్లంతు

ఎన్నికల గుర్తింపు కార్డులు ఉండి కూడా తమ కుటుంబం ఓట్లు గల్లంతు కావడం.. ఎన్నికల సంఘం నిర్లక్ష్యమా లేదా రాజకీయ కోణం ఏదైనా ఉందా అనే అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో తన లాంటి వాళ్ల అనేక మందికి ఓట్లు గల్లంతయ్యాయని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారికి ఈ విషయమై ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

తమ్మినేని వీరభద్రం కుటుంబం ఓట్లు గల్లంతు

ఇదీ చదవండి:ఎంత చెప్పినా అంతే.. పాతబస్తీలో మందకొడిగా పోలింగ్

ABOUT THE AUTHOR

...view details