తెలంగాణ

telangana

Bigg Boss 7 Telugu 7th Week Elimination : బిగ్ బాస్ ఓటింగ్​లో సూపర్ ట్విస్ట్​.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్..!

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 5:30 PM IST

Bigg Boss 7 Telugu Seventh Week Elimination : బిగ్ బాస్ సీజన్ 7 సీజన్.. ఏడో వారానికి చేరింది. ఇప్పటికే హౌజ్​ నుంచి ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు ఏడో వారం ఎలిమినేషన్​ కోసం రంగం సిద్ధమైంది. ఈసారి కూడా మొత్తం ఏడుగురు నామినేట్​ అయ్యారు. మరి, వీరిలో ఇంటికి వెళ్లేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss 7 Telugu 7th Week Elimination
Bigg Boss 7 Telugu 7th Week Elimination

Bigg Boss 7 Telugu Seventh Week Elimination : బిగ్ బాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరు సీజన్​లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్​బాస్.. ప్రస్తుతం ఏడో సీజన్​లో ఉంది. అయితే.. గత సీజన్​ల మాదిరిగా కాకుండా బిగ్​ బాస్​-7 వ సీజన్ ఉల్టా పల్టా అనే డిఫరెంట్ కాన్సెప్టుతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. మొదట ఈ సీజన్​లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఐదో వారం తర్వాత వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా మరో ఐదుగురు కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే.. వీరిలోంచి ఇప్పటి వరకు జరిగిన ఆరు వారాల ఎలిమినేషన్స్​లో భాగంగా వరుసగా కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభ శ్రీ రాయగురు(Subhashree), నయనీ పావనీలు బిగ్​బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోయారు.

Bigg Boss 7 Telugu :ఇక ఆరు వారాలు పూర్తి చేసుకున్నబిగ్ బాస్ తెలుగు 7 సీజన్.. ఇప్పుడు ఏడో వారం కెప్టెన్సీ కోసం జరుగుతున్న టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు.. గులాబీపురం, జిలేబీపురం అంటూ విడిపోయి పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏడోవారం నామినేషన్స్​ ప్రక్రియ జరగ్గా.. అందులో పల్లవి ప్రశాంత్, అమర్​దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, భోలే షావలి, అశ్విని శ్రీ, పూజా మూర్తి అనే ఏడుగురు నామినేట్ అయ్యారు. అయితే.. వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. అందులో ఎవరు వెళ్లనున్నారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఓటింగ్​లో బిగ్ ట్విస్ట్​..బిగ్ బాస్ 7 వ సీజన్ ఏడో వారం ఓటింగ్ ప్రక్రియ ఆరంభం నుంచే ఊహించని విధంగానే సాగుతోంది. నామినేట్ అయిన వాళ్లలో "రైతుబిడ్డ" పల్లవి ప్రశాంత్ మొదటి రోజు నుంచి అత్యధిక ఓట్లతో ముందు వరుసలో ఉన్నాడు. అతని తర్వాత స్థానాల్లో మాత్రం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం రెండో స్థానంలో అమర్ దీప్ చౌదరి ఉన్నాడు. మూడోస్థానం ఓటింగ్​లో మాత్రం మరో ట్విస్ట్​ చోటుచేసుకుంది. గొడవ, బూతులు కారణంగా.. సింగర్ భోలే మొదట డేంజర్ జోన్‌లో ఉండగా.. తర్వాత ఓట్ బ్యాంక్ పెంచుకుని ఇప్పుడు మూడో స్థానానికి వచ్చాడు.

డేంజర్​ జోన్​లో ఆ ఇద్దరూ..ఏడో వారం ఓటింగ్​లో నాలుగో స్థానంలో టేస్టీ తేజ కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో ఉన్న గౌతమ్​.. కృష్ణ ఐదో స్థానానికి పడిపోయాడు. ఇక ఆరు, ఏడు స్థానాల్లో అశ్విని శ్రీ, పూజా మూర్తి ఉన్నారు. అంటే ప్రస్తుతానికి వీళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారని చెప్పుకోవాలి. మరోవైపు దసరా ఫెస్టివల్ సందర్భంగా.. ఆదివారం బిగ్ బాస్ ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుందట. దాంతో ఆరోజు కాకుండా.. శనివారం రోజునే ఎలిమినేషన్ కార్యక్రమం పూర్తి చేయనున్నట్లు సమాచారం. అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నమాట.

మళ్లీ లేడీ కంటెస్టెంటే..?ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు జరిగిన ఆరు వారాల ఎలిమినేషన్స్​లో అందరూ లేడీ కంటెస్టెంట్లే హౌజ్ నుంచి బయటకు వెళ్లారు. అయితే.. ఈ వారం కూడా చివరి స్థానాల్లో ఇద్దరు మహిళలే కొనసాగుతున్నారు. దాంతో ఏడో వారం కూడా లేడీ కంటెస్టెంటే ఎలిమినేషన్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మొదట్లో ఈ వారం భోలే ఎలిమినేట్ అవుతారనుకున్నారు. కానీ, అతనికి ఊహించని విధంగా ఓటింగ్ పెరిగింది. మొదటి నుంచి ఉల్టా పల్టా అని సాగుతున్న ఈ సీజన్​లో ఏదైనా జరగొచ్చు అంటే.. ఇదేనేమో! అనుకుంటున్నారు నెటిజన్లు.

Bhagavanth kesari Rathika Rose : 'భగవంత్​ కేసరి'లో బిగ్​ బాస్​ బ్యూటీ రతికా రోజ్​.. ఆ పాత్ర చేసిందట!

Nayani Pavani Bigg Boss 7 : నయని పాప ఒక్క వారానికే గట్టిగా తీసుకుందిగా... రెమ్యునరేషన్​ ఎన్ని లక్షలంటే?

ABOUT THE AUTHOR

...view details