తెలంగాణ

telangana

బిగ్​ బాస్​ 10వ వారంలో బిగ్ ట్విస్ట్! - ఆ స్టార్ కంటెస్టెంట్​కు కలిసిరాని "ఫ్యామిలీ వీక్" - ఇంటికేనా?

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 7:12 AM IST

Bigg Boss 7 Telugu 10th Week Elimination : బిగ్ బాస్ తెలుగు 7 సీజన్​లో 10వ వారం ఎలిమినేషన్​పై ఫ్యామిలీ వీక్ ఎఫెక్ట్ ఉండనుంది. దీనికి తోడు "​ ఉల్టా పల్టా" నేపథ్యంలో.. జనాలు ఊహించింది ఒకరి పేరైతే.. ఎలిమినేట్ అయ్యేది మరొకరుగా ఉంటున్నారు. మరి.. 10వ వారం ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ కానున్నారో తెలుసా?

Bigg Boss 7 Telugu Tenth Week Elimination
Bigg Boss 7 Telugu Tenth Week Elimination

Bigg Boss 7 Telugu 10th Week Elimination : బిగ్​బాస్ తెలుగు 7వ సీజన్.. 10వ వారానికి చేరింది. గడిచిన తొమ్మిది వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని భట్ల, రతికా రోజ్, శుభశ్రీ, నయని పావని, పూజామూర్తి, ఆట సందీప్​, టేస్టీ తేజా బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇంటి బాట పట్టారు. ఇక 10వ వారం నామినేషన్స్ కాస్తా సిల్లీగా జరిగాయి. ఈ సీజన్​లో ఎక్కువగా రెండు రోజులు జరిగే నామినేషన్స్ ఈసారి ఒకే రోజుతో ముగించారు. హౌజ్​లో మొత్తం 11 మంది ఉండగా.. 10వ వారానికి సంబంధించిన నామినేషన్స్​లో శివాజీ, ప్రిన్స్ యావర్, సింగర్ భోలే, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్(Rathika Rose)ఉన్నారు. మరి.. ఈ ఫ్యామిలీ వీక్​లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss 7 Telugu Family Week :ప్రస్తుతం నడుస్తున్న ఈ ఫ్యామిలీ వీక్​లో.. ఇప్పటి వరకూ హౌస్‌లోకి శివాజీ కొడుకు, అర్జున్ భార్య, అశ్విని తల్లి తొలిరోజు వస్తే.. రెండో రోజు ప్రియాంక ప్రియుడు, గౌతమ్ తల్లి, భోలే భార్య వచ్చారు. ఇక మూడో రోజు శోభాశెట్టి తల్లి, అమర్ భార్య, యావర్ బ్రదర్ వచ్చారు. నాలుగో రోజు శుక్రవారం ఎపిసోడ్​లో రతిక తండ్రి, రైతు బిడ్డ ప్రశాంత్ ఫాదర్ రానున్నట్లు తెలుస్తోంది. 10వ వారం నామినేషన్స్​లో ఉన్న వారిలో నలుగురి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. అయితే.. నామినేట్ కంటెస్టెంట్లను ఎలిమినేషన్ నుంచి కాపాడేందుకు ఈ ఫ్యామిలీ వీక్ బాగా ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు.

గతంలో శ్రీసత్యపై ఫుల్ నెగిటివిటీ ఉండేది. కానీ, ఆమె తల్లి వీల్ చైర్‌లో హౌజ్​లోకి వచ్చేసరికి.. ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఈ విధంగా.. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ నామినేషన్స్‌లో ఉన్న వాళ్లకి సంజీవనిలా మారిందని చెప్పుకోవచ్చు. అయితే.. ఈ ఫ్యామిలీ వీక్‌ రతికకు ఉపయోగపడకపోవచ్చనే చర్చ సాగుతోంది. ఎందుకంటే.. అందరి ఫ్యామిలీ మెంబర్స్​ను ముందు పంపించడంతో.. వారికి సింపథీ పెరిగింది. ఎంతో కొంత పాజిటివిటీ వచ్చింది. రతిక పేరెంట్స్​ను ఆఖరులో శుక్రవారం ఎపిసోడ్​లో పంపనున్నారు. దీనివల్ల ఆమెకు పెద్దగా ఉపయోగం ఉండదని అంటున్నారు. ఎందుకంటే.. నేటితో ఓటింగ్ పోల్స్ క్లోజ్ అవుతాయి. అప్పుడు రతికకు పాజిటివిటీ వచ్చినా.. దానివల్ల ఒరిగేది ఏమీ ఉండదు కదా అంటున్నారు.

జబర్దస్త్‌ కొత్త యాంకర్‌గా బిగ్ బాస్ బ్యూటీ - సౌమ్య రావు స్థానంలో ఎవరొచ్చారంటే?

ఇక, మరో విషయం ఏమంటే.. ఈ వారంలో టాస్క్‌లేం లేవు. ఈ ఫ్యామిలీ వీక్‌ని బట్టే.. ఓట్లు పడతాయి. పైగా గడిచిన రెండు వారాలుగా.. అటు యావర్, ఇటు రతిక టాస్క్‌లు బాగా ఆడటం లేదనీ.. మీ గ్రాఫ్ పడిపోయిందని పదే పదే బిగ్​బాస్ అంటున్నారు. పోనీ ఈవారమైనా గట్టిగా ఆడదామనుకుంటే.. అసలు టాస్క్‌లే లేవు. దాంతో ఈ ఫ్యామిలీ వీకే పెద్ద టాస్క్​గా మారింది.

ఇప్పటివరకు ఉన్న అన్ అఫీషియల్ పోల్స్‌ ప్రకారం.. ఓటింగ్​లో శివాజీ టాప్​లో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో యావర్, మూడో స్థానంలో గౌతమ్, నాలుగో సింగర్​ భోలే ఉండగా.. ఐదో స్థానంలో రతికరోజ్ ఉన్నారు. సో.. ఈ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్స్‌ని బట్టి చూస్తే.. రతిక ఎలిమినేట్ కావడం ఖాయం అనే చర్చ సాగుతోంది. కానీ.. ఈ సీజన్ ఉల్టా-పల్టాగా సాగుతున్న నేపథ్యంలో.. ఏదైనా జరగొచ్చు. మరి.. ఫైనల్​గా ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Bhagavanth kesari Rathika Rose : 'భగవంత్​ కేసరి'లో బిగ్​ బాస్​ బ్యూటీ రతికా రోజ్​.. ఆ పాత్ర చేసిందట!

Bigg Boss Show : 3 రోజులు రూ.2 కోట్లు.. హైయెస్ట్​​ రెమ్యునరేషన్​ తీసుకున్న కంటెస్టెంట్​ తెలుసా?

ABOUT THE AUTHOR

...view details