తెలంగాణ

telangana

సామ్- నయన్ సందడి.. కృతి సనన్ చెల్లితో రవితేజ రొమాన్స్!

By

Published : Mar 31, 2022, 6:57 PM IST

Updated : Apr 1, 2022, 9:39 AM IST

Tollywood latest updates: సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. రవితేజ పాన్ ఇండియా చిత్రం 'టైగర్ నాగేశ్వర రావు', పూరి-విజయ్​ల జేజీఎం, విక్రాంత్ రోనా, బీస్ట్ చిత్రాల సంగతులు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం పదండి.

Tollywood latest updates:
Tollywood latest updates:

Tollywood latest updates: సమంత, నయనతార, విజయ్‌ సేతుపతి కలిసి నటించిన తమిళ చిత్రం 'కాతువాకుల రెండు కాదల్‌'. తెలుగులో 'కణ్మణి రాంబో ఖతీజా' అనే పేరుతో విడుదల కానుంది. విఘ్నేష్‌ శివన్‌ దర్శకుడు. గురువారం షూటింగ్ పూర్తయిన సందర్భంగా సెట్స్‌లో చిత్ర బృందం సందడి చేసింది. నాయికానాయికలు, దర్శకుడు కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. లవ్‌, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. రౌడీ పిక్చర్స్‌తో కలిసి 7 స్క్రీన్‌ స్టూడియో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 28న విడుదలకానుంది.

కేక్ కట్ చేస్తున్న చిత్ర బృందం
కేక్ తినిపించుకుంటున్న సామ్-నయన్

టైగర్ అప్​డేట్
రవితేజ ప్రధాన పాత్రలో పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న 'టైగర్ నాగేశ్వర రావు' నుంచి ఆసక్తికరమైన అప్​డేట్ వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా నుపూర్ సనన్​ను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. నుపూర్.. ప్రముఖ కథానాయిక కృతి సనన్ చెల్లలే కావడం విశేషం. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. 'ది కశ్మీర్ ఫైల్స్ ప్రొడ్యూసర్' అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమం జరగనుంది.

టైగర్ నాగేశ్వర రావు అప్​డేట్

• యువ నటుడు విశ్వక్​సేన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. ఈ సినిమాలోని 'రాంసిలక' అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇది ఈ ఏడాది అత్యుత్తమ బ్రేకప్ సాంగ్​గా నిలిచిపోతుందని చెప్పుకొచ్చింది.

• కిచ్చా సుదీప్ నటిస్తున్న విక్రాంత్ రోనా తెలుగు టీజర్​ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 2న ఉదయం 9.55 గంటలకు టీజర్ విడుదల కానుంది. జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్ సమర్పణలో శాలినీ ఆర్ట్స్ ప్రొడక్షన్​లో సినిమా రూపొందుతోంది.

చిరంజీవి

• తమిళ అగ్రనటుడు విజయ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం బీస్ట్. ఏప్రిల్ 2న ట్రైలర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం కొత్త పోస్టర్​ను విడుదల చేసింది.

బీస్ట్ కొత్త పోస్టర్

• పూరి జగన్నాథ్.. తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన 'జేజీఎం'పై దృష్టిపెట్టారు. ఇటీవలే విలేకరుల సమావేశం పెట్టి చిత్ర విశేషాలు పంచుకున్నారు. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ఆర్మీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా, చిత్రబృందం భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ను కలిసింది.

రాజ్​నాథ్​తో జేజీఎం టీమ్

ఫుల్‌ వీడియోతో..
శర్వానంద్‌, రష్మిక సినీ అభిమానులకు కానుక అందించారు. తామిద్దరు కలిసి నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలోని 'ఆద్య' ఫుల్‌ వీడియో సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులోని బీచ్‌, గుడి తదితర అందమైన లొకేషన్లు, శర్వానంద్‌ కూల్‌ డ్యాన్స్‌, రష్మిక అందం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీమణి రచించిన ఈ గీతాన్ని యాజిన్‌ నైజర్‌ ఆలపించగా దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు. ఈ కుటుంబ కథా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది.

ఇదీ చదవండి:విల్​స్మిత్​పై చర్యలు.. త్వరలో సస్పెన్షన్! ఆస్కార్ వెనక్కి?

Last Updated :Apr 1, 2022, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details