తెలంగాణ

telangana

శ్రుతి హాసన్​ చేసిన ఆ పనికి షాకైన ఫ్యాన్స్​!

By

Published : Sep 10, 2022, 6:54 AM IST

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ శ్రుతి హాసన్​ తన ఫ్యాన్స్​కు బిగ్​ సర్​ప్రైజ్​ ఇచ్చారు. ​దీంతో అభిమానులంతా షాక్​ అయ్యారు. అసలు శ్రుతి ఏం చేసిందంటే?

shruti-haasan-suprises-the-audience-at-hyderabad
shruti-haasan-suprises-the-audience-at-hyderabad

Sruti Hassan Meets Her Fans In Hyderabad : తెరపై సినిమాని చూస్తున్నప్పుడు అందులోని నటులు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? మాటల్లో చెప్పలేని అనుభూతి అది. అలాంటి అనుభూతినే పొందారు '3' (త్రీ) సినిమాని వీక్షించిన కొందరు ప్రేక్షకులు. ధనుష్‌, శ్రుతిహాసన్‌ జంటగా సుమారు పదేళ్ల క్రితం తెరకెక్కిన చిత్రమిది. రీరిలీజ్‌ ట్రెండ్‌లో భాగంగా నిర్మాత నట్టి కుమార్‌ తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమాని గురువారం విడుదల చేశారు.

ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న నగరంలోని ఎఎంబీ మల్టీప్లెక్స్‌లోకి శ్రుతిహాసన్‌ అకస్మాత్తుగా వెళ్లి, సినిమాని వీక్షిస్తున్న వారిని సర్‌ప్రైజ్‌ చేశారు. అప్పటి వరకూ తెరపై కనిపించిన ఆమె తెర ముందు ప్రత్యక్షమవడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకొని హంగామా చేశారు. వారి ఉత్సాహానికి ఫిదా అయిన శ్రుతి హాసన్‌.. ఆ సినిమాలోని ఓ హిట్‌ గీతం 'కన్నులదా' ఆలపించారు. ఆడియెన్స్‌ ఆమెతో శ్రుతి కలిపారు. ఈ సందడి గురువారం రాత్రి నెలకొనగా విజువల్స్‌ శుక్రవారం బయటకు వచ్చాయి.

ఈ విభిన్న ప్రేమ కథా చిత్రాన్ని రజనీకాంత్‌ తనయ ఐశ్వర్య తెరకెక్కించారు. 2012లో విడుదలైన ఈ సినిమా కోలీవుడ్‌, టాలీవుడ్‌లోనూ ప్రేక్షకులు ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి క్రేజ్‌ రావటం విశేషం. విడుదలైన అన్ని చోట్లా ఈ సినిమాని వీక్షించేందుకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో వస్తున్నారని సినీ వర్గాల సమాచారం. రికార్డులు సృష్టించిన సాంగ్‌ 'వై దిస్‌ కొలవెరి' ఈ చిత్రంలోనిదే.

ఇదీ చదవండి:కమల్ మూవీ షూటింగ్​కు బ్రిటన్​ రాణి.. ఏ సినిమా అంటే?

'థ్యాంక్‌ గాడ్‌' ట్రైలర్​ రిలీజ్​.. తెలుగులో శింబు సందడి

ABOUT THE AUTHOR

...view details