తెలంగాణ

telangana

నెటిజన్​కు షారుక్​ ఖాన్​ దిమ్మతిరిగే కౌంటర్​- మందులు పంపిస్తా తగ్గుతుందంటూ!

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 12:58 PM IST

Updated : Dec 7, 2023, 1:14 PM IST

Shahrukh Khan Strong Counter To Netizen : 'డంకీ' ప్రమోషన్స్‌లో భాగంగా నెటిజన్లతో ట్విట్టర్ చాట్‌ నిర్వహించిన బాలీవుడ్​ స్టార్​ హీరో షారుక్‌ ఖాన్‌ను ఓ నెటిజన్ అసభ్య ప్రశ్న అడిగాడు. అతడిగి దిమ్మతిరిగిపోయేలా సమాధానమిచ్చారు. ఇంతకీ షారుక్​ ఏమన్నారంటే?

Shahrukh Khan Strong Counter To Netizen
Shahrukh Khan Strong Counter To Netizen

Shahrukh Khan Strong Counter To Netizen :బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ 'జవాన్' , 'పఠాన్' సినిమాలతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు. ఈ సినిమాలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. అయితే హ్యాట్రిక్​ కొట్టాలని ప్రయత్నిస్తున్న షారుక్ ఖాన్ 'డంకీ' సినిమాతో ఈ నెల 21న ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో షారుక్‌తో పాటు విక్కీ కౌశల్‌ అందాల నటి తాప్సీ కీలక పాత్రలో పోషించారు. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్​ ఇటీవల విడుదల చేశారు. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని షారుక్‌ తాజాగా ట్విటర్‌ చాట్‌ నిర్వహించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. అయితే అందులో ఓ నెటిజన్ షారుక్​ను ఇబ్బందికర ప్రశ్న అడిగాడు. దీంతో అందుకు తగ్గట్టుగానే స్పందించిన షారుక్​ దిమ్మతిరిగిపోయాల సమాధానమిచ్చారు.

ట్విట్టర్​ చాట్ సందర్భంగా ఓ నెటిజన్ 'పీఆర్‌ టీమ్‌ సరిగ్గా పని చేయడం వల్లే ఇటీవల మీరు నటించిన రెండు చెత్త సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. అలాంటి పబ్లిసిటీతో డంకీ సినిమా కూడా విజయాన్ని అందుకుంటుందని మీరు భావిస్తున్నారా?' అని అడిగాడు. దీనిపై షారుక్ ఘాటుగా స్పందించారు. 'మామూలుగా మీలాంటి తెలివైన వాళ్లకు నేను రిప్లై ఇవ్వను. కాకపోతే మీ విషయంలో కాస్త వెసులుబాటు కల్పించా. ఎందుకంటే మీరు మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే, మీకు మంచి మందులు పంపించమని మా పీఆర్‌ టీమ్‌కు చెబుతా. మీరు త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్నా' అని షారుక్ నెటిజన్​కు చురకలంటించారు.

Dunki Movie Cast :ఇక డంకీ విషయానికొస్తే షారుక్ సరసన తాప్సీ నటిస్తున్నారు. అనిల్ గ్రోవర్, బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్, కీలక పాత్రలు పోషించారు. 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'లగేరహో మున్నాభాయ్', 'త్రీ ఇడియట్స్', 'పీకే', 'సంజూ' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలను తెరకెక్కించిన రాజ్‌కుమార్ హిరానీ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్​ అందుకుంటారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

'హాయ్​ నాన్న' ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్!- నాని ఆడియెన్స్​ను మెప్పించాడా?

'డీజే టిల్లు' రాధిక హాట్ ఫోజులు​​​- కిల్లింగ్ ఎక్స్​ప్రెషన్స్​తో నేహా శెట్టి గ్లామర్​ షో

Last Updated : Dec 7, 2023, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details