తెలంగాణ

telangana

సమంత 'యశోద' రిలీజ్ డేట్​​.. శ్రీ విష్ణు కోసం రవితేజ.. అఫ్రీన్​గా రష్మిక

By

Published : Apr 5, 2022, 6:27 PM IST

Updated : Apr 5, 2022, 10:57 PM IST

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'యశోద' సినిమా విడుదల తేదీ ఖారారైంది. అలాగే శ్రీ విష్ణు హీరోగా రూపొందిస్తున్న 'అల్లూరి' , 'శ్రీదేవి శోభన్​బాబు' మూవీ, స్వప్న సినిమా బ్యానర్​లో రష్మిక నటిస్తున్న చిత్రం అప్డేట్స్​ మీకోసం.

movie updates
మూవీ అప్డేట్స్​

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'యశోద'. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. ఆగస్టు 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమాలో సమంత ప్రెగ్నెంట్​గా నటిస్తున్నారని సమాచారం. తమిళనటి వరలక్ష్మి, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా.. హరి - హరీశ్ దర్శకులు.

యశోద సినిమా

అల్లూరి పోస్టర్​:ప్రముఖ నటుడు కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌ పోషించిన అల్లూరి పాత్రను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. అంతగా ఆయా పాత్రలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడిదే పేరుతో (అల్లూరి) మరో చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ విష్ణు హీరోగా దర్శకుడు ప్రదీప్‌ వర్మ రూపొందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను నటుడు రవితేజ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో విష్ణు పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని గొప్ప పోలీసు అధికారి కథను ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నట్టు పోస్టర్‌లో రాసి ఉంది. మరి ఆయన ఎవరో, ఆ స్టోరీ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభంకానుంది. హర్ష వర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తుండగా రాజ్‌ తోట సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

అల్లూరి పోస్టర్​ రిలీజ్​

'శ్రీదేవి శోభన్​బాబు' సినిమా: సంతోష్​ శోభన్​ హీరోగా నటిస్తున్న.. 'శ్రీదేవి శోభన్​బాబు' సినిమా నుంచి అప్డేట్​ వచ్చింది. ఈ సినిమా టీజర్​ను బుధవారం సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

అఫ్రీన్​గా రష్మిక: వైజయంతి మూవీస్​ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్​పై రష్మిక.. అఫ్రీన్​ పాత్రలో నటిస్తోంది. అయితే మంగవాళరం రష్మిక పుట్టిన రోజు సందర్భంగా అఫ్రీన్​ లుక్​ను విడుదల చేసింది చిత్రయూనిట్​. యుద్ధం రాసిన ప్రేమ కథతో ట్యాగ్​లైన్​తో వస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.

అఫ్రీన్​ పాత్రలో రష్మిక
Last Updated :Apr 5, 2022, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details