తెలంగాణ

telangana

'సలార్​' టీజర్​ @100 మిలియన్స్​.. ట్రైలర్​ రిలీజ్​ డేట్ ఆగయా!

By

Published : Jul 8, 2023, 12:00 PM IST

Updated : Jul 8, 2023, 1:32 PM IST

Salaar Trailer release date : పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​ నటించిన సలార్​ మూవీ.. రిలీజ్​కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. గురువారం రిలీజైన టీజర్​ ఇప్పుడు యూట్యూబ్​లో సెన్సేషన్​ సృష్టించింది. ఈ క్రమంలో మూవీ మేకర్స్​ అభిమానుల కోసం మరో సర్ప్రైజ్​ను ప్లాన్​ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ డేట్​ను ప్రకటించేశారు.

salaar trailer
salaar

Salaar Trailer : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సలార్' మూవీ రిలీజ్​కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. గురువారం వచ్చిన ఈ టీజర్​.. విడుదలైన 24 గంటల్లోనే 83 మిలియన్లు అందుకుని రికార్డు సృష్టించింది. ఇప్పుడు యూట్యూబ్​లో మరో సెన్సేషన్​ క్రియేట్​ చేసింది. 100 మిలియన్ల వ్యూస్​ను దాటింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞత తెలిపిన మూవీ టీమ్​ ఓ సాలిడ్​ అప్​డేట్​ను అనౌన్స్​ చేసింది. ఆగస్టులో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపింది.

"ప్రేక్షకులు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు! సలార్ టీజ‌ర్ సృష్టించిన ప్ర‌భంజ‌నంలో మీరంతా భాగ‌స్వాముల‌ై, మాపై మీరు చూపిన అపార‌మైన ప్రేమ, మ‌ద్ద‌తు, అభిమానానికి ప్ర‌తి ఒక్క‌రికి రుణ‌ప‌డి ఉంటాము. భారతీయ సినిమా పరాక్రమానికి ఇదొక ప్రతీక. పాన్ ఇండియా సినిమా సలార్​ టీజర్​ 100 మిలియన్​ వ్యూస్​ను సాధించి దూసుకెళ్తోంది. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ మ‌ద్ద‌తు మా అభిరుచిని మ‌రింత పెంచి అసామాన్య‌మైన సినిమాను మీకు అందించాల‌నే మా కోరిక మ‌రింత బ‌ల‌ప‌డింది." అంటూ ట్పైలర్ అప్డేట్​ను ఇచ్చింది మూవీ టీమ్​.

Salaar Teaser : టీజర్​లో ప్రభాస్​ను కేవలం 10 సెకెన్లు మాత్రమే చూపించిప్పటికీ దీనికి రికార్డు స్థాయిలో వ్యూస్​ వచ్చాయి. దీంతో అభిమానులకు ఈ సినిమా పై ఎటువంటి అంచనాలున్నాయో ఇట్టే చేప్పేయవచ్చు. ఇంగ్లీష్​ డైలాగ్​తో సీనియర్ నటుడు టీనూ ఇచ్చిన ఎలివేషన్​ వీక్షకులను తెగ ఆకట్టుకుంది. టీజరే ఇలా ఉందంటే.. ట్రైలర్ ఇంకెంత బాగుంటుందో అని ఆడియెన్స్​ నెట్టింట చర్చలు మొదలెట్టారు.

Salaar Movie Cast : మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్​ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. ఆద్య అనే జర్నలిస్ట్​గా పాత్రలో ఆమె కనిపించనుంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, సీనియర్ నటుడు జగపతి బాబు ఈ మూవీలో ప్రతినాయకులుగా కనిపిస్తుండగా.. శ్రియా రెడ్డితో పాటు మరికొంతమంది సీనియర్​ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Salaar KGF Connection : ఇక 'సలార్'​ టీజర్​లో కనపడ్డ కొన్ని అంశాలు బ్లాక్​బస్టర్​ మూవీ 'కేజీఎఫ్​'కు కనెక్ట్​ అయ్యి ఉందంటూ సోషల్​ మీడియాలో చర్చలు జరుగుతోంది. కేజీఎఫ్​-2 ముగింపునకు సలార్ పార్ట్​ 1కు ఏదో లింక్ ఉందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దీన్ని రుజువు చేసేందుకు కొన్ని స్క్రీన్​ షాట్లను సైతం ఫ్యాన్స్ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ​పాన్ ఇండియా లెవెల్​లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్​ 28న రానుంది.

Last Updated : Jul 8, 2023, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details