తెలంగాణ

telangana

రణ్​బీర్, ఆలియా గారాల పట్టిని చూశారా? ఎంత ముద్దుగా ఉందో!

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 3:22 PM IST

Updated : Dec 25, 2023, 4:02 PM IST

Ranbir Kapoor Baby Face Reveal : బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్​బీర్ కపూర్- ఆలియా భట్ తమ గారాల పట్టి రాహా ఫేస్ రివీల్ చేశారు.

Ranbir Kapoor Baby Photo Reveal
Ranbir Kapoor Baby Photo Reveal

Ranbir Kapoor Baby Face Reveal : బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్​బీర్ కపూర్- ఆలియా భట్ తమ గారాల పట్టి రాహా ఫేస్ రివీల్ చేశారు. క్రిస్మస్ సందర్భంగా వేడుకకు వెళ్తున్న ఈ జంట తమతోపాటు రాహాను తీసుకెళ్లారు. రణ్​బీర్ పాపను ఎత్తుకొని బయటకు నడుచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో చిన్నారితోపాటు కెమెరాకు ఫోజులిచ్చారు రణ్​బీర్, ఆలియా. పాప ఫేస్ చూసిన నెటిజన్లు చిన్నారి రణ్​బీర్ కపూర్ తండ్రి రిషీ కపూర్, నటి కరీనా కపూర్​లా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Ranbir Alia Bhatt Wedding: బాలీవుడ్​ బ్యూటిఫుల్ కపుల్ రణ్​బీర్- ఆలియా గతేడాది ఏప్రిల్​ 14న గ్రాండ్​గా పెళ్లి చేసుకున్నారు. ముంబయిలో అత్యంత సన్నిహితులు, కొద్దిమంది సెలబ్రెటీల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. కాగా వీరిద్దరూ 2022 నవంబర్ 6న పేరెంట్స్​గా ప్రమోషన్ పొందారు. వీరికి రాహా జన్మించింది. అప్పటి నుంచి వీరిద్దరు చిన్నారి పేరు గురించి తప్ప మరే సమాచారాన్ని బయటపెట్టలేదు. పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోల్లో చిన్నారి ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

అయితే రాహా ఫేస్ చూపాలంటూ నెటిజన్లు గతంలో సోషల్ మీడియాలో కోరగా, ఆలియా స్పందించింది. 'రాహాకు రెండేళ్లు వచ్చేంతవరకు ఆమెకు సంబంధించిన ఎటువంటి ఫొటోలను షేర్ చేయము. మేము ఏదైనా ఈవెంట్​లో కనిపిస్తే ఫొటోగ్రాఫర్లు కూడా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి' అని అప్పట్లో ఆలియా ఓ సందర్భంలో తెలిపింది.

Animal Movie :రణ్​బీర్ కపూర్ ప్రస్తుతం యానిమల్ సినిమా సక్సెస్​ను ఎంజాయ్ చేస్తున్నారు. సందీప్​రెడ్డి వంగ పాన్ఇండియా రేంజ్​లో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్​తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికి దాదాపు రూ.600+ కోట్లు వసూల్ చేసింది. ఈ సినిమాలో రణ్​బీర్​కు జంటగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించగా, సీనియర్ నటుడు అనిల్ కపూర్, నటి తృప్తి డిమ్రి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

'నా కళ్లెదుట అవి ఉంటే ఆగలేను': ఆలియా భట్

'అది నేను ఊహించలేదు - రణ్​బీర్​తో నా రిలేషన్​షిప్​ అలాంటిది'

Last Updated : Dec 25, 2023, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details