Nikhil Ram Charan Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రొడ్యుసర్ విక్రమ్ రెడ్డితో కలిసి 'వి మెగా పిచర్స్' అనే బ్యానర్‌ను లాంచ్ చేశారు. ఈ క్రమంలో తన ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న తొలి చిత్రం గురించి ఆదివారం అనౌన్స్ చేశారు. తను ప్రొడ్యూస్ చేస్తున్న తొలి సినిమాలో నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్నారని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా 'ది ఇండియా హౌస్' చిత్రాన్ని అనౌన్స్ చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేసిన ఆయన..సినిమాకు సంబధించిన గ్లింప్స్‌ను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
The India House Glimpse : లండన్ నేపథ్యంలో, భారత్‌కు స్వతంత్య్రం రాక మందు కాలంలో జరిగిన ఘటనల ఆధారంగా 'ది ఇండియా హౌస్' తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరో నిఖిల్.. శివ అనే పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. శ్యామ్ జీ కృష్ణ వర్మ అనే కీలక పాత్రను అనుపమ్ పోషిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్, అభిషేక్ అగర్వాల్ కూడా రామ్ చరణ్‌తో పాటు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Nikhil Movies : నిఖిల్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. 'కార్తికేయ 2' సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న ఆయన.. ఆ తర్వాత '18 పేజెస్' అనే సినిమాతోనూ మంచి టాక్ అందుకున్నారు. త్వరలో 'స్పై' అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 'కార్తికేయ 2' తర్వాత నిఖిల్, అనుపమ్ ఖేర్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్.. మరోసారి ఈ సినిమా కోసం కలిసారు.
Ram Charan Movies: మరోవైపు రామ్ చరణ్ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్ ఛేంజర్' అనే సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ రోల్స్‌లో కనిపించనున్నట్లు టాక్. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ, అంజలి నటిస్తున్నారు. వీరితో పాటు ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, సునీల్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.