తెలంగాణ

telangana

మొన్న ఎన్టీఆర్​కు ఇప్పుడు రామ్​ చరణ్​కు - ఆస్కార్ నుంచి అరుదైన​ గౌరవం

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 10:12 AM IST

Updated : Nov 2, 2023, 10:57 AM IST

Oscar Academy Branch Actors Ram charan : మెగా పవర్ స్టార్​ రామ్​ చరణ్​ మరో అరుదైన గుర్తింపును సాధించారు. ఆయనకు ఆస్కార్​ 'యాక్టర్స్ బ్రాంచ్‌'లో సభ్యత్వం దక్కింది.

మొన్న ఎన్టీఆర్​కు ఇప్పుడు రామ్​ చరణ్​కు - ఆస్కార్ నుంచి అరుదైన​ గౌరవం
మొన్న ఎన్టీఆర్​కు ఇప్పుడు రామ్​ చరణ్​కు - ఆస్కార్ నుంచి అరుదైన​ గౌరవం

Oscar Academy Branch Actors Ram charan :మెగా పవర్ స్టార్​ రామ్​ చరణ్​ మరో అరుదైన ఘనత సాధించారు. రీసెంట్​గా 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్​ ఆస్కార్ 'యాక్టర్స్ బ్రాంచ్‌'లో సభ్యత్వం పొందగా.. ఇప్పుడు చరణ్​ కూడా ఈ అరుదైన గౌరవాన్ని పొందారు. దీనిని అకాడమీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీంతో మరోసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు హాట్​ టాపిక్​గా మారింది. సినీ ప్రియులు, మెగా అభిమానులు ఆయనకు కంగ్రాట్స్​ చెబుతూ సోషల్​ మీడియా వేదికగా పోస్ట్​లు పెడుతున్నారు.

ఇంకా చరణ్​తో పాటు హాలీవుడ్ నటులు లషనా లించ్​, విక్కీ క్రీప్స్​, లూయిస్​ కూ టిన్ లోక్​, కెకె పామర్​, చాంగ్ చెన్​ కూడా ఈ ఘనతను అందుకున్నారు. "ఈ అద్భుతమైన నటులను మా యాక్టర్స్​ బ్రాంచ్​లో ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో అంకిత భావంతో ఈ నటులు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణంపోశారు. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలను మనకు బహుమతిగా అందించారు. వారి కళతో సాధారణ సినిమాతో కూడా ప్రేక్షకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నారు. భావోద్వేగాలను పంచుతూ ప్రశంసలు అందుకుంటున్నారు " అని ప్రశంసలు కురిపిస్తూ వ్యాఖ్య రాసుకొచ్చారు ఆస్కార్​ నిర్వాహకులు.

Ramcharan Gamechanger Movie Updates : ఇకపోతే రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్​తో కలిసి 'గేమ్​ ఛేంజర్' అనే పొలిటికల్ యాక్షన్ డ్రామ్​​ చేస్తున్నారు. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ దీపావళి కానుకగా ఈ చిత్రంలోని తొలిపాటను విడుదల చేయనున్నారు. చరణ్‌ సరసన కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆ తర్వాత చరణ్​... బుచ్చిబాబుతో కలిసి స్పోర్ట్స్ డ్రామా బ్యాక్​డ్రాప్​లో ఓ చిత్రం చేయనున్నారు. ఇది ఈ ఏడాది చివరి నాటికి సెట్స్​పైకి వెళ్లనుంది.

పర్ఫెక్ట్​ పిక్చర్​ - వరుణ్​, లావణ్యతో కలిసి సింగిల్​ ఫ్రేమ్​లో మెగా హీరోస్

వరుణ్ తేజ్ - లావణ్యకు పవన్​ కల్యాణ్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? ఇప్పుడు ఈ ఫొటోలే ఫుల్ ట్రెండింగ్​!

Last Updated : Nov 2, 2023, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details