తెలంగాణ

telangana

పవర్​ఫుల్​గా నాని 'దసరా' టీజర్.. అంచనాలను మించేసిందిగా!

By

Published : Jan 30, 2023, 4:47 PM IST

Updated : Jan 30, 2023, 4:55 PM IST

నేచురల్​ స్టార్​ నాని హీరోగా నటించిన కొత్త చిత్రం 'దసరా' టీజర్ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తికర సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.

Natural star Nani Dasra teaser
పవర్​ఫుల్​గా నాని 'దసరా' టీజర్.. అంచనాలను మించేసిందిగా

నేచురల్​ స్టార్​ నాని హీరోగా నటించిన కొత్త చిత్రం 'దసరా'. నూతన దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో మార్చి 30 ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తెలుగు టీజర్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఈర్లపల్లి చుట్టూర బొగ్గు కుప్పలు.. మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం అంటూ సాగే పక్కా పల్లెటూరి మాస్‌ డైలాగ్స్​తో ప్రారంభమైంది టీజర్​. నీయవ్వ.. ఎట్టైతె గట్లే గుండు గుత్తగా లేపేద్దాం.. బాంచెన్‌ అంటూ పక్కా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ నాని అదరగొట్టేశారు. బొగ్గుగని బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ఎలిమెంట్స్​తో పక్కా మాస్‌ ఎంటర్​టైనర్​లా దసరా ఉండబోతుందని టీజర్‌తో చెప్పేశాడు దర్శకుడు.

సాయికుమార్, స‌ముద్రఖని, పలువురు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పక్కా తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ‌న్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 30న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. కొద్ది రోజుల కిందటే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ దశలోనే అదిరిపోయే బిజినెస్‌ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు రూ.100 కోట్ల బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని ప్రచారం జరుగుతోంది. రూ.30 కోట్ల వరకు ఆఫర్ చేసిందని తెలిసింది. ఇతర భాషలకు చెందిన రైట్స్‌తో మరో రూ.10 కోట్లు వచ్చినట్లు వినిపిస్తుంది. ఇక శాటిలైట్ రైట్స్ ద్వారా మరో రూ.20 కోట్లు అదనంగా వచ్చిందని సమాచారం. అలా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మొత్తంగా రూ.60 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.


ఇదీ చూడండి:నెం.1గా అల వైకుంఠపురములో.. సంక్రాంతి టాప్​-5 హైయెస్ట్ కలెక్షన్​ మూవీస్​ ఇవే

Last Updated :Jan 30, 2023, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details