తెలంగాణ

telangana

సెల్ఫీ కోసం ఫ్యాన్​ ఆరాటం- కోపంతో యువకుడ్ని కొట్టిన సీనియర్​ నటుడు

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 5:28 PM IST

Nana Patekar Slaps His Fan : సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన అభిమానిపై ప్రముఖ హీరో నానా పటేకర్ చెయ్యి చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Nana Patekar Slaps Fan In Varanasi
Nana Patekar Slaps Fan In Varanasi

Nana Patekar Slaps His Fan :తన విలక్షణ నటనతో బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు సీనియర్ నటుడు నానా పటేకర్‌. ఇటీవల 'ది వ్యాక్సిన్‌ వార్‌'తో ప్రేక్షకులను అలరించిన ఆయన తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. సెల్ఫీ తీసుకునేందుకు ముందుకు వచ్చిన ఓ యువకుడిపై ఆయన చెయ్యి చేసుకున్నారు. దీంతో ఆయన ప్రవర్తన అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలేం జరిగిందంటే?

Nana Patekar Viral Video :'జర్నీ' సినిమా షూట్‌లో భాగంగా ప్రస్తుతం వారణాసిలో పర్యటిస్తున్నారు నానా పటేకర్‌. వారణాసి వీధుల్లో షూటింగ్‌ జరుగుతోన్న సమయంలో అక్కడి వారందరూ ఆయన్ను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. ఇదిలా ఉండగా.. ఆయన దగ్గరకు వెళ్లిన ఓ యువకుడు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. యువకుడి తీరుతో అసహనానికి గురై అతడి తలపై ఆయన గట్టిగా కొట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేగాక సినిమా యూనిట్​లోని ఓ వ్యక్తి.. సదరు అభిమాని కాలర్ పట్టుకుని అందరూ చూస్తుండగానే బయటకు తీసుకెళ్తున్నట్లు వీడియోలో ఉంది.

భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు​..
నానా పటేకర్‌ ప్రవర్తనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'సెల్ఫీ ఇవ్వడం నచ్చకపోతే ఇవ్వను అని చెప్పాల్సింది. ఇలా అందరి ముందు కొట్టడం సరికాదు', 'ఇదే మాత్రం కరెక్ట్‌ కాదు. షూట్ మధ్యలో సెల్ఫీ తీసుకోవాలని అనుకోవడం ఆ యువకుడి తప్పు. అలాగే అతడిని కొట్టడం నటుడిది తప్పు' అని పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు. 'దీక్ష', 'మోహ్రే', 'అభయ్', 'గ్యాంగ్‌', 'భూత్‌', 'రాజ్‌నీతి', 'గోల్‌మాల్‌ ఎగైన్‌', 'కాలా'.. తదితర సినిమాలు నానాపటేకర్​కు మంచి గుర్తింపు తెచ్చాయి.

గదర్​ సినిమా డైరెక్టర్​తో సినిమా
గదర్​, గదర్-​2 లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించి అనీల్​ శర్మ వహించారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న 'జర్నీ' సినిమాలో నానాపటేకర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల అనీల్​శర్మ మాట్లాడుతూ.. దిగ్గజ నటుడితో పనిచేయడం ఆనందంగా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details